అన్వేషించండి

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను మనదేశంలోకి తీసుకువచ్చింది.

రియల్‌మీ 100 మెగాపిక్సెల్ కెమెరాతో కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 11 ప్రో. ఈ సంవత్సరం మేలోనే చైనాలో ఈ మొబైల్ ఎంట్రీ ఇచ్చింది. ఆక్టాకోర్ 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ 11 ప్రో ధర
ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ కొనాలంటే రూ.27,999 పెట్టాల్సిందే.

నేడు (జూన్ 8వ తేదీ) సాయంత్రం ఆరు గంటల నుంచి దీనికి సంబంధించిన ఎర్లీ బర్డ్ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో వినియోగదారులకు రూ.2,000 తగ్గింపు లభించనుంది. దీంతో పాటు రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్లు అందించనున్నారు. అంటే రూ.20 వేల రేంజ్‌లోనే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. ఆస్ట్రల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్, సన్‌రైజ్ బీజ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

రియల్‌‌మీ 11 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు 100 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ఇటీవలే రియల్‌మీ (Realme) తన కోకా కోలా ఎడిషన్ ఫోన్, రియల్‌మీ 10 ప్రో 5జీ (Realme 10 Pro 5G) ని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మీరు వెనుక వైపున డ్యూయల్ టోన్ డిజైన్‌ను చూడవచ్చు. వెనుక వైపు నలుపు, ఎరుపు కోకా కోలా రంగులను చూడవచ్చు. దీనితో పాటు రెండు కంపెనీల బ్రాండింగ్ వెనుక ప్యానెల్‌లో కనుగొనబడుతుంది.

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా కోలా ఎడిషన్ గత సంవత్సరం లాంచ్ అయిన రియల్‌మీ 10 ప్రో 5జీ లాగా ఉంటుంది. వాస్తవానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కోకా-కోలాతో కలిసి పని చేసినందున, దీని కారణంగా రియల్‌మీ ఈ ఫోన్‌ను మరోసారి కొత్త డిజైన్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ ఈ కొత్త ఫోన్ ధరను రూ.20,999గా నిర్ణయించింది. మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, రియల్ మీ స్టోర్ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget