అన్వేషించండి

Infinix GT 10 Pro: ‘నథింగ్’ డిజైన్‌తో వచ్చిన ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - రూ.20 వేలలోపే - గేమింగ్ ఫీచర్లు కూడా!

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ తరహా డిజైన్‌తో మార్కెట్లో లాంచ్ అయింది.

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. ఇది ఒక గేమింగ్ ఫోన్. ఇందులో వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ ఎఫెక్ట్ అందించే బ్యాక్ ప్యానెల్ అందించారు. మినీ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్, రిఫ్లెక్టివ్ హార్డ్ వేర్‌ను ఇందులో చూడవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. వేపర్ కూలింగ్ ఛాంబర్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. సైబర్ బ్లాక్, మిరేజ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

ఐసీఐసీఐ, కొటక్ బ్యాంకు కార్డులతో దీన్ని కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది రూ.3,334 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను మొదట కొనుగోలు చేసిన ఐదు వేల మంది వినియోగదారులకు అదనంగా గేమింగ్ యాక్సెసరీస్ కూడా ఉచితంగా అందించనున్నారు.

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌తో పాటు రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా లభించనున్నాయి. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10 బిట్ అమోఎల్ఈడీ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. హోల్ పంచ్ కటౌట్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

ఈ ఇన్‌ఫీనిక్స్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు ఎల్ఈడీ ఇండికేటర్‌ను కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. లైట్ సెన్సార్, ఈ-కంపాస్, జీ-సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

Read Also: ఐఫోన్ లవర్స్‌ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget