అన్వేషించండి

Honor X50i Plus: 108 మెగాపిక్సెల్ కెమెరా, 512 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.20 వేలలోనే - సూపర్ ఫీచర్లతో హానర్ ఎక్స్50ఐ ప్లస్!

Honor X50i Plus Price: హానర్ ఎక్స్50ఐ ప్లస్ అనే కొత్త ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేశారు.

Honor X50i Plus Launched: హానర్ ఎక్స్50ఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. హానర్ ఎక్స్50ఐ సిరీస్‌లో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్50ఐ ప్లస్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 35W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

హానర్ ఎక్స్50ఐ ప్లస్ ధర (Honor X50i Plus Price)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,600) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగా (సుమారు రూ.20,900) ఉంది. క్లౌడ్ వాటర్ బ్లూ, ఫాంటసీ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, లిక్విడ్ పింక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. హానర్ ఎక్స్50ఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హానర్ ఎక్స్50ఐ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Honor X50i Plus Specifications, Features)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ఓఎస్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్50ఐ ప్లస్ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 35W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, ఓటీజీ, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.68 సెంటీమీటర్లు కాగా, బరువు 166 గ్రాములుగా ఉంది.

ఇటీవలే హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఇందులో మూడు స్టోరేజ్ ఆప్షన్లు, మూడు కలర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను చూడవచ్చు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget