అన్వేషించండి

JIO 5G Service: మరిన్ని నగరాలకు Jio 5G సేవలు, మీ ఫోన్ లో 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

రిలయన్స్ జియో 5G సేవలను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు 5G సర్వీసును పొందేందుకు ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రిలయన్స్ జియో ఇప్పటికే 8 నగరాల్లో 5G  సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారా, బెంగళూరు, హైదరాబాద్‌ సరికొత్త నెట్వర్క్ సేవలను అందిస్తోంది. ఈ నగరాల్లో ఉంటున్న జియో వినియోగదారులు  My Jio యాప్‌లో వెల్ కం ఆఫర్ ను అందుకుంటారు. ఆ తర్వాత యాక్టివ్ 5G నెట్‌ వర్క్‌ కి కనెక్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2023 నాటికి  దేశం అంతటా  5G సేవలు అందుబాటులోకి వస్తాయని  టెలికాం ప్రొవైడర్ జియో ఇప్పటికే వెల్లడించింది. 5G నెట్‌వర్క్‌ కు సంబంధించి మరిన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..   

SMS, నోటిఫికేషన్‌ ద్వారా వెల్ కమ్ ఆఫర్

ఢిల్లీ, ముంబై లేదా Jio 5G అందుబాటులో ఉన్న ఏదైనా నగరంలో నివసిస్తున్నట్లయితే,  వినయోగదారులు MyJio యాప్ నుంచి SMS లేదంటే నోటిఫికేషన్‌ అందుకుంటారు.  మెసేజ్‌లో Jio 5G వెల్‌ కమ్ ఆఫర్, దాని ప్రయోజనాన్ని ఎలా పొందాలి అనే సమాచారం ఉంటుంది. 5G సపోర్టు చేసే స్మార్ట్‌ ఫోన్లు ఉన్న వినియోగదారులు 5G సేవలను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 5G నెట్‌ వర్క్ యాక్సెస్ కోసం, రిలయన్స్ జియో ఒక ప్రత్యేకమైన లాంచ్ డీల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ డీల్ పొందే అవకాశం ఉన్న వారికి  Jio 500 Mbps, 1 Gbps మధ్య వేగంతో అపరిమిత 5G డేటా వినియోగాన్ని అందిస్తోంది.

ఈ స్టెప్స్ ఫాలోకండి, నెట్వర్క్ యాక్సెస్ చేసుకోండి!

వినియోగదారులు ఇప్పటికే నోటిఫికేషన్‌ను స్వీకరించినా,  5Gకి కనెక్ట్ చేయడంలో సమస్య ఉన్నట్లయితే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. Jio 5G నెట్‌ వర్క్‌ ని మీ స్మార్ట్‌ ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌ లో ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత జియో సిమ్‌ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్ ను ఎంచుకోవాలి.  ఇందులో 3G, 4G, 5G ఎంపికలను కలిగి ఉంటారు. ఇప్పుడు 5Gని సెలెక్ట్ చేసుకోవాలి. 5G నెట్‌ వర్క్‌ ని ఎంచుకున్న తర్వాత    స్మార్ట్‌ ఫోన్ నెట్‌ వర్క్ స్టేటస్ బార్‌ లో 5G గుర్తును గమనించవచ్చు.

4G SIM 5G సేవలకు సపోర్ట్ చేస్తుందన్న జియో, ఎయిర్ టెల్

ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ 5Gని పొందడానికి కస్టమర్‌లు కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయనవసరం లేదని వెల్లడించాయి. ఆయా ప్రాంతాల్లో 5G  సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత  ప్రస్తుత 4G SIM 5G కి కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపాయి.  5G సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ ఉండటంతో పాటు మీరు నివసించే ప్రాంతంలో 5Gకి యాక్సెస్ ఉంటే ఆటోమేటిక్ గా 5G సేవలను పొందే అవకాశం ఉంటుందని తెలిపాయి.  ముందుగా, సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్ మీ 5G ఫోన్‌లో ఇన్‌ స్టాల్ చేయబడిందో? లేదో? ముందుగా నిర్దారించుకోవాలని సూచించాయి. మెజారిటీ స్మార్ట్‌ ఫోన్ తయారీదారులు ఇప్పటికే అప్‌ గ్రేడ్ చేసినప్పటికీ, డిసెంబర్ నాటికి ఆపిల్ అప్‌గ్రేడ్‌ను అందిచబోతున్నట్లు వెల్లడించింది.

Read Also: 5G సర్వీసులో సామ్ సంగ్ సరికొత్త రికార్డు, డౌన్‌ లోడ్ స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవుతారు

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget