అన్వేషించండి

Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.

Android User Alert: ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇటీవల ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం హెచ్చరికను జారీ చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ 13, దాని మునుపటి వెర్షన్లను ఉపయోగించేవారిని హెచ్చరించారు. ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది వినియోగదారులకు ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు.

ఆండ్రాయిడ్ 13లో కనిపించే ఈ లోపాలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివరించింది. ఇది ఆండ్రాయిడ్ 13 వినియోగదారులకు ముప్పుగా మారుతోందని స్పష్టం చేసింది. హ్యాకర్లు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఉన్న మొబైల్స్‌ను త్వరగా హ్యాక్ చేయగలరని, సమాచారంతో పాటు మీ డిజిటల్ వాలెట్ నుంచి డబ్బును కూడా దొంగిలించవచ్చని తెలుసుకుందాం. ఈ బలహీనతలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా హ్యాకర్లు తమ కోడ్‌ను డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేయడం, డివైజ్‌కు యాక్సెస్ పొందడం, వినియోగదారుల మొత్తం సమాచారాన్ని దొంగిలించడం వంటి పనులను సులభంగా చేయగలరని ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రమాదంలో ఉన్న డివైస్‌లు ఇవే...
సెర్ట్ కథనం ప్రకారం ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న డివైస్‌లు ఉన్నాయి. ఈ లోపాలు కేవలం ఒక కాంపోనెంట్‌కే పరిమితం కాకుండా పరికరంలోని వివిధ భాగాలలో ఉన్నాయి. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌ల వంటి ముఖ్యమైన భాగాల్లో కూడా లోపాలు ఉన్నాయి. అలాగే ఏఎర్ఎం, మీడియాటెక్, యూనిసోక్, క్వాల్‌కాం వంటి అనేక హార్డ్‌వేర్ తయారీదారుల నుంచి వచ్చే భాగాలు, క్వాల్‌కాం క్లోజ్డ్ సోర్స్ భాగాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

అప్‌డేట్ ఇచ్చిన గూగుల్..
గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది ఈ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. మీరు మీ ఫోన్‌ని ఇంకా అప్‌డేట్ చేయకుంటే, ముందుగా చేయాల్సింది అప్‌డేట్ చేయడమే.

సెక్యూరిటీ ప్యాచ్ ముఖ్యం బిగిలూ...
మీరు ఎల్లప్పుడూ సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్ చేయాలి. ఫోన్‌కి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఫోన్‌లో ఉన్న లోపాలను తొలగిస్తుంది. భద్రతను కూడా పెంచుతుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. థర్డ్ పార్టీ యాప్‌లతో జాగ్రత్తగా ఉండండి. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా మిగతా సోర్స్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. ఏదైనా లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసిన థర్డ్ పార్టీ యాప్‌లు ప్రమాదకరంగా మారవచ్చు. ఏదైనా యాప్ మిమ్మల్ని అనుమతులు అడుగుతున్నట్లయితే, ఆ యాప్‌కు అనుమతులు అవసరమా కాదా అని మీరు ముందుగా చెక్ చేయాలి. అవసరం లేకుంటే పర్మిషన్లు ఇవ్వొద్దు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget