అన్వేషించండి

Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు

వాట్సాప్ మెస్సేజ్‌లను సంస్థతో పాటు థర్డ్ పార్టీ వారు సైతం యాక్సెస్ చేసి షేర్ చేసుకుంటారని, డేటా ప్రైవసీ అనేది పచ్చి అబద్ధమనే వ్యాజ్యంపై ఎలాన్ మస్క్ స్పందించారు. వాట్సాప్ నమ్మలేం అన్నారు.

ఫేమస్ మెస్సేజింగ్, వీడియో, ఆడియో కాలింగ్ యాప్ వాట్సాప్‌ను నమ్మలేమని ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శించారు. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని మాట ఇచ్చినప్పటికీ మెటా సంస్థ యూజర్ల ప్రైవేట్ మెస్సేజ్‌లను చదువుతోందని ఆరోపిస్తూ దాఖలైన క్లాస్-యాక్షన్ వ్యాజ్యంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌క్రిప్టెడ్ చాట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తామని, యూజర్లు ఇకనైనా X చాట్‌కు మారాలని ఎలాన్ మస్క్ సూచించారు. 

ఎక్స్ చాట్ వాడాలన్న ఎలాన్ మస్క్
ప్రముఖ పర్సనల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను నమ్మలేం అని కామెంట్ చేసి ఎలాన్ మస్క్ గురువారం మెటాతో తన వైరంలో మరోసారి అగ్గి రాజేసారు. మెటా యాజమాన్యంలోని ఈ యాప్ స్ట్రాంగ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ క్లెయిమ్ చేసినప్పటికీ, వినియోగదారుల ప్రైవేట్ సందేశాలను చదువుతోందని, వాటిని సేవ్ చేస్తుందని.. యాక్సెంచర్ వంటి థర్డ్ పార్టీలతో మెటా పంచుకుంటోందని ఆరోపిస్తూ కంపెనీపై దాఖలైన కొత్త క్లాస్ యాక్షన్ పిటిషన్‌పై మస్క్ స్పందించారు. యూజర్ల డేటా ప్రైవసీ ఎక్కడుందని వాట్సాప్‌ను ప్రశ్నించారు. 
యూజర్ల డేటా ప్రైవసీలో వాట్సాప్‌ను నమ్మలేమని పేర్కొన్న ఎలాన్ మస్క్.. మరొక పోస్ట్‌లో, మెసేజ్‌లు, వాయిస్/ వీడియో కాల్స్ కోసం X చాట్‌కు మారాలని వినియోగదారులకు సూచించారు. ఇక్కడ మీ డేటాకు ప్రైవసీ లభిస్తుందని పేర్కొన్నారు.


Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు

మస్క్ ఆరోపణలపై వాట్సప్, మెటా ఆగ్రహం..
తమ సంస్థపై ఎలాన్ మస్క్ చేసిన పోస్టుపై స్పందించిన వాట్సాప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వాట్సాప్ క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో పేర్కొన్న క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధం,  అసంబద్ధమైనవి. వాట్సాప్ దశాబ్ద కాలంగా సిగ్నల్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తోంది. కనుక మీ మెస్సేజ్‌లను పంపేవారు, రిసీవ్ చేసుకునే వారు తప్ప మరెవరూ వాటిని చదవలేరని వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. 

వాట్సాప్ మెసెంజర్ ద్వారా మరొక వ్యక్తితో చాట్ చేసినప్పుడు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉపయోగిస్తుంది. చాట్ బయట ఉన్నవారు, చివరికి వాట్సాప్ కూడా వాటిని చదవలేదు. మీ ఆడియోను కూడా వినలేదు, ఎవరితోనూ షేర్ చేసుకోవు. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో మీ సందేశాలు లాక్‌తో భద్రంగా ఉంటాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి, చదవడానికి కావాల్సిన కీ కేవలం సెండర్, రిసీవర్ వద్ద మాత్రమే ఉంటుందని వాట్సాప్, మెటా సంస్థ పేర్కొంది. 

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ క్లెయిమ్‌లపై మెటా విచారణ
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ క్లెయిమ్‌లపై విచారణ జరుగుతోంది. మెటా కంపెనీ వాట్సాప్ మెస్సేజ్‌లు యాక్సెస్ చేయగలదని మాజీ మెటా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై అమెరికా లా ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని ఈ ఏడాది బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ దర్యాప్తును అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక ఏజెంట్లు చేస్తున్నాయి. 2024లో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలైన ఇలాంటి విజిల్‌బ్లోయర్ ఫిర్యాదుపై కంపెనీ విచారణను ఎదుర్కొంది.

వాట్సాప్ కోసం కంటెంట్ మోడరేషన్ పని చేసిన ఇద్దరు వ్యక్తులు గత ఏడాది కామర్స్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్‌తో పలు విషయాలు తెలిపారు. మెటాలోని కొంతమంది సిబ్బందికి వాట్సాప్ మెస్సేజ్‌లకు యాక్సెస్ ఉందని సంచలనానికి తెరలేపారు. కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్‌లోని కొంతమంది ఉద్యోగులకు కూడా ఈ సౌకర్యం కల్పించారని చెప్పడంతో ఆందోళన నెలకొంది.  తమ వర్క్ లొకేషన్లో వాట్సాప్‌నకు యాక్సెస్ ఉన్న వారు ఉన్నట్లు ఆధారాలు లభించాయని గతంలో ఓ ఏజెంట్ పేర్కొన్నారు. లార్కిన్ ఫోర్డైస్ అనే వ్యక్తి యాక్సెంచర్‌లో కాంట్రాక్టర్‌గా మెటా కోసం కంటెంట్ మోడరేటర్‌గా చేశారని, కాంట్రాక్టర్‌లకు కూడా మెస్సేజ్ యాక్సెస్ లభించిందని నివేదిక పేర్కొంది. 

వాట్సాప్ యూజర్ల మెస్సేజ్‌లు స్టోర్ చేస్తోందని ఆరోపణలు
వాట్సాప్ సందేశాలు ప్రైవేట్ కావని ఒక కొత్త క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో ఆరోపించారు. వాట్సాప్, మెటా ప్లాట్‌ఫామ్స్, యాక్సెంచర్ పీఎల్‌సీ, యాక్సెంచర్ ఎల్‌ఎల్‌పీలు అక్రమంగా యూజర్ల ప్రైవేట్ వాట్సాప్ సందేశాలను చదవడంతో పాటు థర్డ్ పార్టీలతో పంచుకున్నాయని బ్రియాన్ వై. షిరాజీ, నిదా శామ్సన్ క్లెయిమ్ చేశారు. వినియోగదారులు ప్రైవేట్ మెస్సేజ్‌లను పంపుకోగలిగే సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా కంపెనీలు వాట్సాప్‌ను మార్కెటింగ్ చేశాయని, కానీ వాస్తవానికి వాట్సాప్, మెటా ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులు పంపిన ప్రైవేట్ మెస్సేజ్‌లు చదవడం, స్టోర్ చేయడం, థర్డ్ పార్టీకి డేటా షేర్ చేశారని పిటిషనర్లు షిరాజీ, శామ్సన్ ఆరోపించారు.

‘ఎన్‌క్రిప్ట్ చేసిన, యాక్సెస్ చేయడానికి వీలులేకుండా ఉండాల్సిన వాట్సాప్ సందేశాలపై మెటా ఉద్యోగులతో పాటు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్‌లకు యాక్సెస్ ఉందని విజిల్‌బ్లోయర్లు ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లకు సమాచారం ఇచ్చారు. యూజర్ల మెస్సేజ్‌లు ప్రైవేట్ అని హామీ ఇచ్చిన వాట్సాప్, వాటిని సీక్రెట్‌గా చదవడం, స్టోర్ చేయడతో పాటు థర్డ్ పార్టీలకు షేర్ చేసుకోవడం వారి ప్రైవసీకి భంగం కలిగించడమే’ అని క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో ర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget