అన్వేషించండి

DALL-E 3 ఇకపై ఫ్రీ, Bing Chatలో అదిరిపోయే ఇమేజెస్ కోసం మీరూ ట్రై చేయండి

ఇమేజ్ క్రియేటర్స్ కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. DALL-E 3 ఇకపై Bing Chatలో ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది.

DALL-E 3ని ఉపయోగించి అద్భుతమైన ఇమేజెస్ ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మన ఆలోచనలకు అనుగుణంగా ఇమేజెస్ ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇప్పటి వరకు DALL-E 3ని ఉపయోగించాలంటే కొంత మేర రుసుము చెల్లించాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు చక్కటి న్యూస్ అందించింది.  DALL-E 3 ఇకపై Bing Chatలో లేదా Bing ఇమేజ్ జనరేటర్‌తో ఉచితంగా లభిస్తుందని ప్రకటించింది. 

టెక్స్ట్ టు ఇమేజ్  లేటెస్ట్ వెర్షన్

DALL-E 3 అనేది  OpenAI ద్వారా రూపొందించబడినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. DALL-E 3 అనేది టెక్స్ట్-టు-ఇమేజ్ మోడల్ తాజా వెర్షన్.  ఈ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఇమేజెస్ ను అద్భుతంగా రూపొందించే అవకాశం ఉంటుంది. ఇమేజెస్ లోని ముఖాలు, ముఖ కదలికలు, ఇతర అంశాలను అద్భుతంగా చూపించే అవకాశం ఉంటుంది. మనం అనుకున్న ఇమేజ్ ను అనుకున్నట్లుగా తయారు చేసుకోవచ్చు. 

ఇమేజెస్ లో క్వాలిటీ, అదిరిపోయే అవుట్ పుట్

ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్, బింగ్ ఇమేజ్ క్రియేటర్‌లో DALL-E 2 వెర్షన్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు దానికి లేటెస్ట్ వెర్షన్ గా DALL-E 3 వినియోగదారుల ముందుకు వచ్చింది.  అయితే,  DALL-E 2 లో రూపొందించిన ఇమేజెస్ తో పోల్చితే DALL-E 3‌తో రూపొందించిన ఇమేజెస్ మరింత కచ్చితత్వాన్ని చూపిస్తున్నాయి. ఇమేజెస్ అవుట్ పుట్ తో పాటు క్వాలిటీలోనూ గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ముఖంలో పలికించాల్సిన భావాలను అద్భుతంగా వచ్చేలా చేస్తుంది.   

గతంలో DALL-E 2 తో రూపొందించిన ఇమేజెస్ ను ఇప్పుడు DALL-E 3తో మళ్లీ రూపొందించి పరీక్షిస్తున్నారు ఇమేజెస్ క్రియేటర్స్. పాత వెర్షన్ తో పోల్చితే కొత్త వెర్షన్ అద్భుతంగా ఉందంటున్నారు. గత ఇమేజెస్ తో పోల్చితే కొత్త ఇమేజెస్ లో ఎక్కువ వివరాలను పొందుపరిచే అవకాశం ఉందంటున్నారు. చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు, ఇమేజెస్ మరింత రియలిస్టిక్‌గా ఉన్నాయంటున్నారు టెక్ నిపుణులు.   

OpenAI, ChatGPT సాయంతో చేసిన ఇమేజెస్ మాదిరిగానే DALL-E 3 లో రూపొందించిన ఇమేజెస్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.  ఈ ఇమేజెస్ అందంతో పాటు పొందిక, ప్రాంప్ట్ ఫాలోయింగ్‌ మరింత మెరుగ్గా కనిపిస్తోంది. DALL-E 3తో రూపొందించిన ఇమేజెస్ ప్రాంప్ట్స్ తో పాటు మరింత లాజికల్‌గా ఉండేలా చేస్తాయి. ఇందులో తయారైన మోడల్‌ గందరగోళానికి గురిచేస్తుందనే భయం ఉండదు.  ప్రాంప్ట్స్ కు మరింత ఖచ్చితమైన చిత్రాలను రూపొందించడమే కాకుండా, Bing ఇమేజ్ క్రియేటర్, బింగ్ చాట్‌తో రూపొందించిన చిత్రాలను గుర్తించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఇమేజెస్ లో తయారు చేసిన డేట్ తో పాటు ఒక కనిపించని డిజిటల్ వాటర్‌ మార్క్‌ ను కలిగి ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మొత్తంగా తాజాగా అందుబాటులోకి వచ్చిన DALL-E 3 సాయంతో అద్భుతమైన ఇమేజెస్ పొందే అవకాశం ఉంది. 

Read Also: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Embed widget