అన్వేషించండి

WhatsApp: ‘వాట్సాప్’లో ఫాంట్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?

మనం నిత్యం వాడే వాట్సాప్ లో ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోజుల్లో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దగ్గర వాట్సాప్ కూడా ఉంటుంది. జనాలు  రోజు వారీ అవసరాలతో పాటు ఉద్యోగులు ఆఫీస్ వ్యవహారాలను వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. చాలా మందికి చాలా రకాలుగా వాట్సాప్ ఉపయోగపడుతుంది. అయితే, వాట్సాప్ లో అందరికీ తెలియని ఫీచర్లు, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

ఫాంట్ మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు! 

వాట్సాప్ లో చాలా మంది ఎవరికి మెసేజ్ చేసిన అది ఒకే రకమైన ఫాంట్ లో వెళ్తుంది.  అలా కాకుండా ఫాంట్ ను బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, పదాలు కొట్టేసినట్లు రావడం సహా పలు రకాలుగా మార్చుకొనే అవకాశం ఉంది. ఫాంట్ ను బోల్డ్ చేయాలంటే మీరు బోల్డ్ చేయాలనుకున్న పదానికి లేదంటే వాక్యానికి ముందు, తర్వాత స్టార్(*) గుర్తు పెడితే సరిపోతుంది. ఇటాలిక్ చేయడానికి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. కాకపోతే స్టార్(*)కు బదులుగా అండర్ స్కోర్ ( _ ) గుర్తు పెట్టాలి. పదాలు కొట్టేసినట్లు రావడానికి టిల్డే(~) గుర్తు వాడాలి.  వీటిని ఉపయోగించి వాట్సాప్ చాట్ ను మరింత అందంగా చేసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమైన మెసేజ్ లకు స్టార్ ఇవ్వండి!

వాట్సాప్ లో  చాలా ముఖ్యమైన మెసేజ్ వచ్చింది. కానీ, ఆ మెసేజ్ వివరాలు వారం, రెండు వారాల తర్వాత అవసరం పడ్డాయనుకోండి. అప్పటికప్పుడు దాన్ని వెతకాలంటే చాలా కష్టం. పది రోజులు వెనక్కి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే, ముఖ్యమైన మెసేజెస్ కు స్టార్ ఇస్తే సరిపోతుంది. స్టార్ మెసేజెస్ వాట్సాప్ మెసేజ్ లిస్టులో పైనే కనిపిస్తుంది. వెతకాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా  వాట్సాప్ లో స్టార్ మెసేజ్ ల్లోకి వెళ్లి ఆ మెసేజ్ ను చూసుకోవచ్చు. మీకు అవసరమైన మెసేజ్ ని సెలక్ట్ చేసుకున్నాక పైన కనిపించే స్టార్ గుర్తుని క్లిక్ చేస్తే..  ఆ మెసేజ్ ని స్టార్ మెసేజ్ గా మారిపోతుంది.

ఒకే ఫోన్‌ లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడొచ్చు!

వాస్తవానికి ఒకే మొబైల్ లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాటడం సాధ్యం కాదు. కానీ, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రెండు అకౌంట్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పారలల్ స్పేస్, డ్యూయల్ స్పేస్, 2 అకౌంట్స్ వంటి మొబైల్ అప్లికేషన్స్ వాడాలి. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ యాప్స్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్స్ లో ఏదైనా ఒకదాన్ని ఇన్‌ స్టాల్ చేసుకోవాలి. దానికి అవసరమైన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత, రెండో వాట్సాప్ అకౌంట్ ను మీరు ఇందులో ఉపయోగించవచ్చు.

Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?

టాప్ హెడ్ లైన్స్

AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Embed widget