అన్వేషించండి

భారత్ ఏఐ మార్కెట్‌లో Perplexity Vs Gemini- ఆఫర్లతో పోటాపోటీ- ఈ రెండింటిలో ఏది ఉత్తమం?

Perplexity vs Gemini: భారత్ మార్కెట్‌ భవిష్యత్‌ ఏఐదే. ఈ విషయాన్ని గ్రహించిన కంపెనీలు ఉచిత ఆఫర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ రేస్‌లో Perplexity, Googe Gemini ముందు వరసలో ఉన్నాయ.

Perplexity vs Gemini: మన ప్రస్తుతం AI యుగంలో ఉన్నాం. ఆందరి ఆలోచనలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతానికి రీల్స్, ఇతర ఫన్నీ వీడియోలను చూస్తున్న జనం మరింత డీప్‌గా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యా, ఉద్యోగాల్లో కూడా AIను విస్తృతంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం అవుతుంది. అందుకే Perplexity AI , Google Gemini అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించాయి. ఒకరు ఏకంగా విద్యార్థులను టార్గెట్ చేస్తే మరొకరు ఎయిర్‌టెల్‌వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏమైనా సరే ఈ పోటీ ఏఐ విస్తృతిని మాత్రం మరింతగా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు.

2025లో AI టూల్స్ మార్కెట్లో Perplexity AI , Google Gemini మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. రెండు ప్లాట్‌ఫారమ్‌లు తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి ఆఫర్లు ప్రకటించాయి. దీంతో ఈ రెండింటిపై జనాల్లో ఆసక్తి మొదలైంది. జనాల్లో ఉన్న క్రేజీని క్యాష్ చేసుకునేందుకు అందరి కంటే అడుగు ముందుకు వేసింది. 20 వేలకుపైగా విలువైన Gemini ఏఐ టూల్‌ను విద్యార్థులకు ఏడాదిపాటు ఉచితంగా అందివ్వబోతోంది. దీనికి పోటీగా Perplexity ఏయిర్‌టెల్ కస్టమర్‌లను క్యాప్చర్ చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రెండ ఏఐ టూల్స్ కూడా ఏడాది పాటు ఉచితంగా ప్రో ప్లాన్ అందివ్వబోతున్నారు.

Perplexity , Google Gemini కు సంబంధించిన ప్రో వెర్షన్ అనేది ఫైనల్ కాదు. అంతకు మించిన వెర్షన్‌లు ఉన్నాయి. అయితే ప్రీమియర్ వెర్షన్‌లో ఉండే ఫీచర్స్‌ గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ ఆఫర్ ప్రకటించాయి. దీని వల్ల కొంతమంది అయినా పూర్తి సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వీలు ఉంటుందని భావిస్తున్నారు.ఈ రెండు టూల్స్‌కూడా ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్న ప్రో వెర్షన్‌లు ఖరీదైనవి. సామాన్యులు కొనుగోలు చేయలేనివిగానే ఉన్నాయి. Perplexity AI టూల్‌ ప్రోవెర్షన్  కావాలంటే ఏడాదికి 19,900 చెల్లించాలి. Google Gemini AI టూల్ ప్రోవెర్షన్ కొనుగోలు చేయాలంటే సంవత్సరానికి 19,500 కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండూ ఫ్రీగా పొంద వచ్చు. ఏడాది పాటు మాత్రమే ఉచితంగా సేవలు పొందవచ్చు. తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో యువకుల జనాభా ఎక్కువగా ఉంది. అందుకే ఇక్కడి యువతను టార్గెట్ చేస్తూ ఏఐ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. ఇక్కడ మార్కెట్‌ను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో 15 బిలియన్లు దాటిపోతుందని వివిధ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అందుకే ముందస్తుగా మార్గెట్‌లో జెండాలు పాతడానికి వివిధ వ్యూహాలతో వస్తున్నాయి. దీర్ఘకాలికంగా లాభపడొచ్చని ఆయా సంస్థల అంచనా.

ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీఫైనల్‌గా వినియోగదారుడు మాత్రం తీసుకునే సబ్‌స్క్రిప్షన్ ఎంత వరకు ఉపయోగపడుతుందనేది ఆలోచిస్తాడు. అందుకే అసలు పెర్‌ప్లెక్సిటీ, జెమినిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో చూస్తాడు. వాటిని తన గ్రోత్‌కు ఎలా యూజ్ అవుతుందనేది తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ వివరాలు ఇక్కడచూడొచ్చు. 
     
పెర్‌ప్లెక్సిటీలో ఉండే ప్రత్యేకత ఏంటీ?
ఇండియాకు చెందిన ఈ పెర్‌ప్లెక్సిటీ వెళ్లే దారే చాలా భిన్నంగా ఉంది. సోనార్ ప్రో  R1 1776 రీజనింగ్‌, క్లాడ్ 4.0 సోనెట్ అడ్వాన్స్‌డ్,  క్లాడ్ 4.0 ఓపస్ థింకింగ్ మోడల్‌లు, xAI, గ్రోక్ 4, GPT-4.1 లేదా o3-ప్రో , గూగుల్ జెమిని 2.5 మోడళ్లతో పని చేస్తోంది. అంటే మీరు ఏదైనా సమాచారం అడిగితే ఈ ఏఐ టూల్స్‌లో వేగంగా ఇవ్వగలుగుతుందో దానికి ఫస్ట్ ప్రయార్టీ ఇస్తుంది. మీరు పది ఏఐ టూల్స్ వెతుక్కునే వీలు లేకుండే వీటన్నింటినీ ఒక చోట చేసి మీకు సేవలు అందిస్తోంది. ఇందులో మీరు ఏ ఏఐ టూల్‌ నుంచి సమాచారం కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఏది టూల్ ముందు కచ్చితమైన సమాచారం ఇస్తుందో దానికే వెళ్లాలనుకుంటే బెస్ట్ అనే ఆటోసెలెక్ట్ మోడ్ ఒకటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన సమాచారం క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. 

పెర్‌ప్లెక్సిటీ ఫ్రీ ప్లాన్‌లో ప్రాథమిక సమాచారం తెలుసుకోవడం పూర్తిగా ఉచితమే. ఇందులోనే రోజుకు 5 ప్రో సెర్చ్‌లు అవకాశం కల్పిస్తుంది. స్టాండర్డ్‌ AI మోడల్ యాక్సెస్ కలిగి ఉంటుంది. అపరిమిత కాన్సైస్ సెర్చ్‌లు చేసుకోవ్చచు.

అదే పెర్‌ప్లెక్సిటీ ప్రో ప్లాన్‌ ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితమే అయినా ఒకవేల కొనుక్కోవాలంటే మాత్రం నెలు దాదాపు 20 వేలు పెట్టాలి. ఇందులో రోజుకు 300పైగా ప్రో సెర్చ్‌లు కల్పిస్తుంది. GPT-4, Claude-3 వంటి అడ్వాన్స్‌డ్ AI మోడల్స్ వాడుకునే వీలు కలుగుకుంది. అపరిమిత ఫైల్ అప్‌లోడ్‌ చేసుకొని క్రోడీకరించుకోవచ్చు.రోజుకు 500 డీప్‌ సెర్చ్ క్వయిరీలు ఉంటాయి.  

పెర్‌ప్లెక్సిటీ మ్యా్‌ ప్లాన్‌ అయితే నెలకే 17 వేలు చెల్లించాలి. దీంట్లో రోజుకు 1,000 ప్రోసెర్చ్‌ ఆప్షన్‌ ఉంటుంది. GPT-4o, Claude 3.5 Opus యాక్సెస్ ఉంటుంది. లైవ్ డేటా యాక్సెస్ , అప్‌టు-డేట్ సమాచారం అందిస్తుంది. ప్రతి సమాధానానికి విశ్వసనీయమైన సోర్స్ చెబుతుంది.వందల సోర్సెస్ నుంచి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది.20కుపైగా భాషల్లో సమాచారం అందిస్తుంది. 

జెమినిలో ఉండే ప్రత్యేకత ఏంటీ?

గూగుల్‌కు చెందిన జెమిని ఏఐలో Gemini 2.5 Pro మోడల్, డీప్ రీసెర్చ్, కెమెరా యాక్సెస్, స్క్రీన్-, Gemini Live, Veo 3 మోడల్‌ను ఉపయోగించే ఫ్లో ఫిల్మ్‌మేకింగ్ టూల్, NotebookLM , ఈ ప్రోలో లభిస్తాయి. అంతే కాకుండా Google Driveలో 2TB క్లౌడ్ స్టోరేజ్‌ మీ సొంతం అవుతుంది.

జెమినీ ఫ్రీ ప్లాన్‌లో అన్ని పూర్తిగా ఉచితంగా ఉంటుంది. Gemini 1.5 Flash,  2.0 Flash Experimental మోడల్స్ ద్వారా మాత్రమే సమాచారాన్ని సేకరించివచ్చు. వాయిస్ సంభాషణ, గూగుప్‌ యాప్‌ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ కల్పిస్తుంది. అదే అడ్వాన్స్డ్‌ తీసుకుంటే నెలకు 1,721 రూపాయలు చెల్లించాలి. జెమిని 1.5 Pro,  2.5 Pro యాక్సెస్ ఇస్తారు. డీప్ రీసెర్చ్ రిపోర్ట్ జనరేషన్ అందుబాటులో ఉంటుంది. 2టీబీ గూగుల్‌ వన్ స్టోరేజీ ఉచితంగా లభిస్తుంది. మరో అడుగు ముందుకేసి జెమిని బిజినెస్ వెర్షన్ తీసుకుంటే 1722 రూపాయలు నెలకు చెల్లించాలి. ఇందులో జీమెయిన్, డాక్స్, స్లైడ్స్‌, షీట్ల్‌లో ఏఐ ఫీచర్లన వాడుకోవచ్చు. ఎంటర్‌ప్రైజెస్ గ్రేడ్ సెక్యూరిటీ లభిస్తుంది. NotebookLM Plus లభిస్తుంది. 

జెమిని ఎంటర్‌ప్రైజెస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే నెలకు 2,585 రూపాయలు చెల్లించాలి. అడ్వాన్స్డ్‌ కొలాబరేన్ ఫీచర్స్‌తోపాటు అడ్మిన్ కంట్రోల్ ఉంటుంది. మీటింగ్స్‌లో లైవ్ ట్రాన్స్‌లేటెడ్‌ క్యాప్షన్ సౌకర్యం ఉంటుంది. రెండు టూల్స్ కూడా వాటి సొంత స్ట్రంత్‌ కలిగి ఉన్నాయి. యూజర్ తమకు కావాల్సిన వర్క్‌ఫ్లోను బట్టి అవసరమైన ఏఐ టూల్‌ను ఎంచుకోవాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Akhanda 2 Postponed : డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
India vs SA 3rd ODI : విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
Balakrishna Nandamuri: బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్‌ ఫీలింగ్ ఏమిటి?
బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్‌ ఫీలింగ్ ఏమిటి?
Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
Embed widget