అన్వేషించండి

iPhone 13 Release Date: ఐఫోన్ 13 సిరీస్ స్పెసిఫికేషన్లు లీక్.. సెప్టెంబర్‌లో లాంచ్! 

ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ కానుందని లీకుల ద్వారా తెలుస్తోంది. కొత్త సిరీస్ లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ మోడల్స్ విడుదల కానున్నట్లు సమాచారం.

ఐఫోన్ తర్వాతి సిరీస్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ కానుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం కొత్త సిరీస్ లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ మోడల్స్ విడుదల కానున్నాయి. వీటిలో 1 టీబీ స్టోరేజ్ ఆప్షన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్స్‌లో 512 జీబీ స్టోరేజ్ ఉన్న విషయం తెలిసిందే. 9 టు 5 మాక్, వెడ్‌బుష్ సెక్యూరిటీస్, బ్లూమ్‌బెర్గ్ అనే సంస్థలు ఐఫోన్ 13 ఫోన్లకు సంబంధించి వేర్వేరుగా నివేదికలను అందించాయి. అయితే దీనిని సంబంధించి యాపిల్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.

లీకుల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి..

  • ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (LiDAR) స్కానింగ్ టెక్నాలజీ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐ ఫోన్ 12 సిరీస్ ఫోన్లలో కేవలం ప్రో, మాక్స్ వెర్షన్లలో మాత్రమే లిడార్ సెన్సార్లను అందించారు. అయితే గతంలో రిలీజైన ఫోన్లలో మాదిరి కేవలం ప్రో వెర్షన్లలో మాత్రమే లిడార్ సెన్సార్లు ఉంటాయని ట్రెండ్ ఫోర్స్ అనే సంస్థ తెలిపింది. యాపిల్ తన 2021 ఐఫోన్ లైనప్‌లో లిడార్ స్కానర్లను అందించడం ద్వారా ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ని అప్ గ్రేడ్ చేయనుంది. 
  • ఐఫోన్ 13 ఫోన్లను 90 నుంచి 100 మిలియన్ల యూనిట్లలో సరఫరా చేయాలని సంస్థ భావిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ ఉత్పత్తి 80 మిలియన్ యూనిట్లకు చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐఫోన్ 13 ఉత్పత్తిని 20 శాతం పెంచాలని యాపిల్ భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో పేర్కొంది.  

iPhone 13 Release Date: ఐఫోన్ 13 సిరీస్ స్పెసిఫికేషన్లు లీక్.. సెప్టెంబర్‌లో లాంచ్! 

  • వెడ్‌బుష్ అంచనా ప్రకారం.. ఐఫోన్ 13 సిరీస్.. ఐఫోన్ 12 సిరీస్‌తో సారూప్యంగా (చూడటానికి దాదాపు ఒకేలా) ఉండనుంది. 
  • ఐఫోన్ 13 సిరీస్.. యాపిల్ వాచ్‌లతో కలిపి రానుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇందులో ఫాస్టర్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండనున్నట్లు తెలిపాయి. ఇది పెర్ల్, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో రానున్నట్లు పేర్కొన్నాయి. 
  • ఐఫోన్ 13 ప్రో మోడల్ ఫోన్లు.. శామ్‌సంగ్ తయారు చేసిన 120 HZ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలతో వస్తాయని చెబుతున్నాయి.
  • ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఫోన్లలో రేడియో ఫ్రీక్వెన్సీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (ఆర్‌ఎఫ్‌పీసీబీ) ఉండనుంది. అలాగే వీటిలో రీఫ్రెష్ రేట్‌ 120 HZగా ఉండనుంది.  
  • ఐఫోన్ 13 సిరీస్ ఏ15 బయోనిక్ చిప్ సెట్‌తో రానుందని తెలుస్తోంది. వీటిని టీఎస్ఎంసీ రూపొందించింది. 
  • ఐఫోన్ 13 ఫోన్లలో నాచ్ ఉండదని సమాచారం. నాచ్ లెస్ ఫోన్లను తయారుచేస్తున్నామని గతంలో యాపిల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త సిరీస్ ఫోన్లలో సాధ్యమైనంత వరకు నాచ్ ఉండదనే లీకులు వస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget