అన్వేషించండి

Agentic AI: చిట్టి రోబోలాంటి AIతో కొత్త ప్రపంచం.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న ఏజెంటిక్ AI

AI తో ప్రపంచమే మారిపోయింది కదా.. ఇప్పుడు దాని బాబు లాంటి టెక్నాలజీ వస్తోంది. రాబోయే Agentic AI తో మీ లోకమే మారిపోనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..

Agentic AI Expalined: మార్వెల్ సిరీస్‌లో ఐరన్ మ్యాన్.. పర్సనల్ AI సిస్టమ్ తెలుసు కదా… J.A.R.V.I.S. (Just A Rather Very Intelligent System). నేరుగా ఓ మనిషితో మాట్లాడుతున్నట్లే తన AI అసిస్టెంట్‌కు కమాండ్‌ ఇస్తాడు.. అదే అన్ని పనులూ చేస్తుంటుంది. ఆ తర్వాత అతను డవలప్‌ చేసిన K.A.R.E.N సిస్టమ్ Spiderman వాడుతుంటాడు. అంతెందుకు మన రోబో సినిమాలో కనిపించిన చిట్టి రోబో అయితే ఇంకా అడ్వాన్స్‌డ్. అందులో సైంటిస్ట్ వశీకర్ చెప్పిన పనులన్నీ ఆ హ్యూమనాయిడ్ రోబో చేసి పెడుతుంది. అవన్నీ సినిమాలు కాబట్టి.. ఊహకు పరిమితులు లేవు కాబట్టి.. చాలా అడ్వాన్స్డ్‌గా చూపించారు. అయితే ఇప్పుడు మన ప్రపంచం అంటే.. టెక్నాలజీ ఉపయోగించేవాళ్ల ప్రపంచం కూడా మారిపోబోతోంది. మరీ ఈ సినిమాల్లో చూపించే అంత రేంజ్‌లో అడ్వెంచర్లు ఉండవ్‌ కానీ… ఇప్పుడున్న పరిస్థితిలో అయితే బాగా మార్పులొస్తాయి. Agentic AI తో అది సాధ్యం అవుతుంది.

అసలేంటి ఈ Agentic AI..?

ఇప్పుడు మనం ChatGpt లాంటి ఓపెన్ AI, జనరేటివ్ AI సోర్సులు విపరీతంగా వేడేస్తున్నాం కదా.. దీనిని బాబు లాంటి టెక్నాలజీ ఈ ఏజెంటిక్ AI. ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌కు అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఇప్పుడున్న ChatGPT, Gemini, Perplexity వంటి AI టూల్స్ మన పనులనే మరింత సులభతరం చేసి పెడతాయి. అంటే మనం Prompt ఇస్తే దానికి అనుగునంగా మనకు కావలసిన పనులు AI చేసి పెడుతుంది. ఓ కమాండ్ ద్వారా కొంచం పెద్ద పనులు కూడా చేసుకోగలుగుతున్నాం. కోడ్‌లు రాయడం వంటి పెద్ద ప్రాసెస్ ఉన్న పనులూ పూర్తిచేస్తున్నారు. Agentic AI మనం ఇచ్చే టాస్క్ లను మొత్తం అదే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి చేసి పెడుతుంది. పేరులోనే ఉన్నట్లు ఈ AI మన పనులన్నింటినీ ఓ ఏజెంట్ లా చేసి పెడుతుందన్నమాట. అందుకే ఆ పేరు. ఈ టెక్నాలజీ ద్వారా అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. మ్యాన్ పవర్ పై పెడుతున్న డబ్బులు కంపెనీలకు మిగలటంతో పాటు కంప్లీట్ ఆటోమేషన్ కారణంగా హ్యూమన్ ఎర్రర్ కి ఛాన్సే లేకుండా పనులు చక్కబెట్టొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Agentic పై పరిశోధనలు చేస్తున్న టెక్ దిగ్గజాలు

AI పై పరిశోధనలైనప్పుడే ఏజెంటిక్ AI పైనా ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే ఏజెంటిక్ AI ను వినియోగించటంలో ఎన్ని లాభాలు ఉంటాయో అన్నే సవాళ్లు కూడా ఉంటాయి. అందుకే ఈ టెక్నాలజీ నార్మల్ పీపుల్ చేతుల్లోకి రావటానికి కాస్త టైమ్ పట్టింది. బట్ ఇప్పుడు ప్రపంచమంతా ఆటోమేషన్ వైపు పరుగులు తీస్తున్న టైమ్ లో ఏజెంటిక్ AI ని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని టాప్ టెక్ కంపెనీలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. OpenAI, Microsoft, GitHub, AWS లాంటి సంస్థలు ఏజెంటిక్ AIను డెవలప్ చేసి ఓ ఫినిషింగ్ ప్రొడక్ట్ గా ప్రజలకు పరిచయం చేయాలని కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి.

Agentic AI బిజినెస్ వైపు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏజెంటిక్ AI మార్కెట్ విలువ 6లక్షల కోట్లుగా ఉంది. 2032 నాటికి ఈ బిజినెస్ 200 బిలియన్ డాలర్స్ అంటే 16లక్షల కోట్లు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిజినెస్ లో నార్త్ అమెరికా మార్కెట్టే 40 నుంచి 46శాతం వరకూ హోల్డ్ చేస్తోంది. ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న ఏ AI కంపెనీకైనా సరే 40 శాతం బేస్ ఇండియన్ మార్కెట్టే. మనోళ్లు AI ను అంతలా వాడేస్తున్నారు. 2026నాటికి 90శాతం భారత కంపెనీలు తమ వ్యాపారంలో AI ను భాగస్వామ్యం చేస్తారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంత అగ్రెసివ్ గా ఉన్న భారత్ ఏజెంటిక్ AI ను కూడా అంతే ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలదని అందరూ విశ్వసిస్తున్నారు.

Agentic తో సమస్యలు:

సరే దీని వల్ల ప్రాబ్సమ్ ఏం రావా అంటే అదే అసలు సమస్య. కొద్ది రోజుల క్రితం నటుడు నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు చూశారా...? ఆయన పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అంటే ఇప్పుడు వస్తున్న సాంకేతికత సాయంతో నాగార్జున వాయిస్ ను ఇమిటేట్ చేసినా..ఫేషియల్ ఫీచర్స్ ను వాడుకున్నా...అదంతా ఆయన పర్మిషన్ తో జరగాలి లేదంటే వాడుకున్న వాళ్లు చట్టప్రకారం శిక్షకు అర్హులవుతారు. అంటే AI తీసుకువస్తున్న మార్పులు ఇలా మనుషల్లో భయాలను కూడా నింపుతున్నాయి. ప్రైవసీ థెఫ్ట్, సెక్యూరిటీ రిస్క్, హ్యాకింగ్ లాంటి భయాలు ఏజెంటిక్ AI వల్ల ఉంటాయని టెక్ నిపుణులే భయపడుతున్నారు. అయితే ఎలా వాట్సప్ లాంటి వాటికి ఎండ్ టూ ఎండ్ ట్రాన్స్ స్క్రిప్షన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో అలానే ఏజెంటింక్ AI ను కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేస్తూ టెక్ కంపెనీలు పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. అదే జరిగితే మరో రెండేళ్లలో ప్రతీ మనిషికి సాంకేతికతంగా చిట్టి రోబో లాంటి ఫ్రెండ్ చేతిలో ఉన్నట్లే..!

టాప్ హెడ్ లైన్స్

Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Embed widget