Computer Accessories: టాప్ బ్రాండ్ కంప్యూటర్ పరికరాలపై 76% డిస్కౌంట్.. సేల్ లో ఇంకా ఏమున్నాయంటే!
Amazon great India festival sale 2024 : అమెజాన్ ఫెస్టివల్ సేల్లో... కంప్యూటర్ పరికరాలపై క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. కీబోర్డ్, మౌస్, యూఎస్బీ, మైక్రోసాఫ్ట్ ఆడియో పరికరాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్
Amazon great India festival sale 2024 : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సైల్ 2024లో భాగంగా భారీ ఆఫర్స్ ను అందిస్తుంది ఆ సంస్థ. వర్క్ ఫ్రం హోం జాబ్ తో పాటు ఆఫీస్ కి వెళ్లే వారికి సైతం ఎంతో ఉపయోగపడే కంప్యూటర్ పరికరాలపై క్రేజీ ఆఫర్స్ ను తీసుకొచ్చింది. కీబోర్డ్ తో పాటు మౌస్, యూఎస్బీ, మైక్రోసాఫ్ట్ ఆడియో పరికరాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కంప్యూటర్ పరికరాలపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తో పాటు ప్రీమియం కంప్యూటర్ పరికరాలను సైతం తేలికగా కొనుగోలు చేసే అవకాశాన్ని కస్టమర్స్ కు అందిస్తోంది. నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయంతో పాటూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.
కీబోర్డ్ పై 68% డిస్కౌంట్ - ఈ సెల్ లో కీబోర్డ్ లపై 68% వరకు తగ్గింపును అందిస్తుంది అమెజాన్. వైర్ లెస్ కీబోర్డ్ లతో పాటు గేమింగ్ కీబోర్డ్స్, మెకానికల్ కీబోర్డ్స్ పై భారీ తగ్గింపును తీసుకొచ్చింది. ప్రీమియం కీబోర్డ్స్ ను కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం.
మౌస్ లపై 67% డిస్కౌంట్ - హై క్వాలిటీ టాప్ బ్రాండెడ్ వైర్ లెస్ మౌస్ లతో పాటు గేమింగ్ మౌస్లు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిపై 67% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
హెడ్ సెట్స్ పై 60% డిస్కౌంట్ - టాప్ బ్రాండెడ్ కంపెనీలైన సోనీ, హెచ్ పి కంపెనీ హెడ్ సెట్స్ పై అమెజాన్ సేల్ లో భారీ ఆఫర్స్ ఉన్నాయి. ఇక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికి బెస్ట్ డీల్స్ ఇవే.
వెబ్ కామ్స్ పై 65% డిస్కౌంట్ - మైక్రోసాఫ్ట్, లాజిక్, లాజిటెక్ లాంటి టాప్ బ్రాండ్ వెబ్ కామ్స్ పై ఈ సెల్ లో భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ఇక ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడే వారికి.. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వారికి, మీటింగ్స్ కు అటెండ్ అయ్యే ఉద్యోగులకు హై క్వాలిటీ వీడియో వెబ్ కామ్స్ అవసరమవుతాయి. ఇలాంటి వారు వీటిని ప్రయత్నించవచ్చు.
మైక్రోఫోన్స్ పై 65% డిస్కౌంట్ - జీబ్రానిక్స్, ఆమ్ప్లి గేమ్ పాటు ప్రముఖ కంపెనీ మైక్రోఫోన్స్ పై ఈ సెల్ లో 65% డిస్కౌంట్ ను అమెజాన్ ప్రకటించింది. ఇక ఆడియో సెట్ అప్ ను హై క్వాలిటీ గా మార్చుకోవాలి అనుకుంటే ఈ మైక్రోఫోన్స్ ను ట్రై చేయాల్సిందే.
స్పీకర్లపై 57 పర్సెంట్ డిస్కౌంట్ - హై క్వాలిటీ స్పీకర్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది. జీబ్రానిక్స్, జేపీఎల్, లాజిటెక్ వంటి టాప్ క్వాలిటీ స్పీకర్స్ పై బెస్ట్ డీల్స్ ను తీసుకొచ్చింది.
యూఎస్బీ డ్రైవ్స్ పై 76% డిస్కౌంట్ - ట్రన్సెండ్, కింగ్స్ స్టాన్, సాన్ డిస్క్ లాంటి యుఎస్బి లపై భారీ ఆఫర్స్ ను ప్రకటించింది. ఇక బ్యాకప్, ఆటో డేటా బదిలీకి అవసరం అయ్యే టాప్ బ్రాండ్ యూఎస్బీ లు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అమెజాన్ బెస్ట్ డీల్స్ ను ప్రకటించింది.