హల్క్ హోగన్ ఇక లేరు: దిగ్గజ రెజ్లర్ మరణం.. అభిమానుల్లో విషాదం, ఆరోగ్య సమస్యలే కారణం!
Hulk Hogan Dead:రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ 71 ఏళ్ల వయసులో గుండపోటుతో మరణించారు. దీంతో రెజ్లింగ్ ప్రపంచ విషాదంలో మునిగిపోయింది.

Hulk Hogan Dead: ఆగ్నేయాసియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ అభిమానులకు బిగ్ షాక్. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన లెజెండరీ రెజ్లర్ హల్క్ హోగన్ (Terry Gene Bollea) 71 ఏళ్ల వయసులో మరణించారు. ఈ విషాదమైన ఘటన గురించి TMZ స్పోర్ట్స్ మొదటిసారిగా రిపోర్టు చేసింది. ఫ్లోరిడా, క్లియర్‌వాటర్‌లోని తన నివాసంలో గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొదుతూనే ఆయన మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో చెబుతోంది. ఈ ఘటన రెజ్లింగ్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన అభిమానులను షాక్‌కి గురయ్యారు.
ఆరోగ్య సమస్యలు
హల్క్ హోగన్ గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని వార్తలు వచ్చాయి. మే 2025లో ఆయన గొంతు, మెడకు సంబంధించిన శస్త్రచికిత్స (ఫోర్-లెవల్ ఎంటీరియర్ సెర్వికల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూషన్) చేయించుకున్నారు. ఈ శస్త్రచికిత్స ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ఆయన కోలుకుంటున్నారని కుటుంబం ప్రకటించింది. ఇటీవల ఆయన కోమాలో ఉన్నారని రుమర్లు వచ్చినప్పటికీ, ఆయన భార్య స్కై డైలీ ఈ ఆరోపణలను ఖండించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా "ఆయన కోమాలో లేరు, ఆయన గుండె చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కోలుకుంటున్నారు" అని ప్రకటించారు. ఇంతలో ఆయన మరణించారనే వార్త అభిమానుల్లో నిరాశను కలిగించింది.
హల్క్ హోగన్ జీవితం
హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ యూజీన్ బోలియాగా .1953 ఆగస్టు 11న అమెరికా జార్జియా రాష్ట్రంలోని ఆగస్టాలో జన్మించారు. రెజ్లింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన "హల్క్ హోగన్" అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. 1970ల నాటికి ఆయన రెజ్లింగ్‌లో తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారు. 1980లలో ఆయన "హల్కమేనియా" అనే ఉత్సాహభరితమైన స్టోరీని క్రియే్ చేశారు. రెజ్లింగ్‌ను ప్రపంచవ్యాప్త క్రీడగా మార్చారు. ఆయన ఎరుపు, పసుపు రంగుల డ్రెస్‌లు, హ్యాండిల్‌బార్ ముస్తాచ్, "What do you want to do when Hulkamania runs wild on you?" అనే ప్రసిద్ధ డైలాగ్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు.హల్క్ హోగన్ రెజ్లింగ్ రంగంలో అనేక రికార్డులను సృష్టించారు.
హల్క్ హోగన్ ఏడు సార్లు WWE (ప్రస్తుతం WWF) ఛాంపియన్‌షిప్ గెలిచారు. మొదటి తొమ్మిది రెజ్ల్‌మేనియా ఈవెంట్‌లలో ఎనిమిదిసార్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆండ్రే ది జెయింట్, రాండీ సేవేజ్, ది రాక్ వంటి లెజెండ్‌లతో పోరాడిన విషయం రెజ్లింగ్ చరిత్రలో ప్రత్యేకమైనది. 1996లో ఆయన తన "హలీవుడ్ హల్క్ హోగన్" పేరుతో న్యూ వరల్డ్ ఆర్డర్ (NWO) ఫ్యాక్షన్‌ను స్థాపించి, తన కెరియర్‌లో కొత్త అధ్యాయం ప్రవేశపెట్టారు. ఈ మార్పు రెజ్లింగ్ రంగంలో భారీ మలుపు తిప్పింది.
రెజ్లింగ్ బయోండ్: సినిమాలు మరియు టీవీరెజ్లింగ్‌తోపాటు హల్క్ హోగన్ హాలీవుడ్‌లోనూ తన గుర్తింపు సాధించారు. 1982లో వచ్చిన "రాకీ III" సినిమాలో థండర్‌లిప్స్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకర్షించారు. "నో హోల్డ్స్ బార్డ్", "సబర్బన్ కమాండో", "మిస్టర్ నానీ" వంటి సినిమాల్లో నటించిన ఆయన, తన రెజ్లింగ్ బలాన్ని సినిమాల్లోనూ ప్రదర్శించారు. "హోగన్ నోస్ బెస్ట్" అనే రియాలిటీ టీవీ షోలో తన కుటుంబంతో కలిసి పాల్గొనడం ద్వారా ఆయన ప్రజల మదిలో మరింత స్థిరపడ్డారు. ఈ షో 2005 నుంచి 2007 వరకు ప్రసారం అయ్యింది.
హల్క్ హోగన్ తన రెజ్లింగ్ కెరియర్‌లో అనేక విధాలుగా గాయపడ్డారు. ఇవి ఆయన ఆరోగ్యంపై ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చాయి. గత దశాబ్దంలో ఆయన 25 శస్త్రచికిత్సలు చేయించుకున్నారని ఆయన ఒకసారి వెల్లడించారు. అయినా తన ఆరోగ్య సమస్యలను అధిగమించి రెజ్లింగ్ రంగంలో తిరిగి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 2025లో రియల్ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించి, దాని కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ క్రీడను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఆయన ఆసక్తి చూపించారు. హల్క్ హోగన్ మరణించిన రోజున ఉదయం, ఫ్లోరిడాలోని నివాసానికి అత్యవసర సేవల విభాగాలు చేరుకున్నాయి. గుండెపోటు రావడంతో ఆయనను స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆయన మరణించినట్టు నిర్ధారణ అయ్యింది.





















