Harry Brook: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ - మోస్ట్ ఎక్సైట్‌మెంట్‌లో సన్‌రైజర్స్!
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.
![Harry Brook: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ - మోస్ట్ ఎక్సైట్‌మెంట్‌లో సన్‌రైజర్స్! VIDEO: Harry Brook Hit Five Sixes in One Over Wave of happiness Ran in Sunrisers Hyderabad Harry Brook: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ - మోస్ట్ ఎక్సైట్‌మెంట్‌లో సన్‌రైజర్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/10/4f842cf50635c9a85b67abff2653cf441673359317563206_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Harry Brook 5 Sixes Video: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ మరోసారి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఈసారి ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్ XIతో జరుగుతున్న రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు. బ్రూక్ భారత సంతతికి చెందిన ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌ను లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు సిక్సర్లు బాదాడు. బ్రూక్ కొట్టిన ఈ సిక్స్‌ల వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బ్రూక్ తన మొదటి సిక్స్‌ను ఆన్ సైడ్ వైపు కొట్టడాన్ని మీరు చూడవచ్చు. దీని తర్వాత, అతను బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి లెగ్ సైడ్ వైపు రెండవ సిక్స్ కొట్టాడు. అనంతరం మరోసారి జోరుగా బ్యాట్ ఝుళిపించి మూడో సిక్స్ బాదాడు. దీని తర్వాత మరోసారి బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి నాలుగో సిక్స్ కొట్టాడు. అదే సమయంలో అతను చివరి సిక్స్ కోసం క్రీజు నుంచి బయటకు వచ్చాడు.
హ్యారీ బ్రూక్ సెంచరీ మిస్
ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన సెంచరీని కోల్పోయాడు. 71 బంతుల్లో ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 136.62గా ఉంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కేవలం 69.2 ఓవర్లలోనే 465 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆనందం
హ్యారీ బ్రూక్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్‌లో ఆనందం వెల్లివిరిసింది. ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలంలో హైదరాబాద్ రూ.13.25 కోట్ల భారీ ధరకు బ్రూక్‌ను కొనుగోలు చేసింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి కొన్ని ఇన్నింగ్స్‌లు క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.
రావల్పిండిలో పాకిస్థాన్‌తో ఆడుతున్నప్పుడు అతను తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్‌లో 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పటివరకు బ్రూక్ టెస్టు క్రికెట్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 80 సగటుతో 480 పరుగులు చేశాడు.ఇందులో అతను మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.
2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ దాదాపుగా చరిత్ర సృష్టించాడు. 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. అత్యంత వేగంగా టెస్టు సెంచరీ చేసిన ఆంగ్లేయుడిగా నిలిచే అవకాశాన్ని నాలుగు బంతుల తేడాతో చేజార్చుకున్నాడు. 81 బంతుల్లో అతను సెంచరీ సాధించాడు.
Harry Brook 5 consecutive sixes!
— Rampy (@RiserTweex) February 8, 2023
NZ XI v England
(📸: @BLACKCAPS )
Scorecard:https://t.co/ckhKiwlz2L
Youtube link: https://t.co/OCqTYw8mbT pic.twitter.com/XaJn9x9aDa
𝗛𝗮𝗿𝗿𝘆 𝗛𝗮𝗿𝗮 𝗩𝗲𝗲𝗿𝗮 𝗕𝗿𝗼𝗼𝗸 🔥
— SunRisers Hyderabad (@SunRisers) February 8, 2023
Our #Riser smashes ✋🏼 sixes in an over before falling just short of a century!#OrangeArmy pic.twitter.com/6qZ8t28Hea
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)