అన్వేషించండి

అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఆఫ్షనిస్థాన్‌పై నేపాల్‌ విజయం

దక్షిణాప్రిక వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో నేపాల్‌ జట్టు చివరి దశలో విజయాన్ని నమోదు చేసింది. పార్క్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్షనిస్థాన్‌ జట్టుపై నేపాల్‌ విజయం సాధించింది.

Under-19 World Cup : దక్షిణాప్రిక వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో నేపాల్‌ జట్టు చివరి దశలో విజయాన్ని నమోదు చేసింది. పార్క్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో నేపాల్‌ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అప్ఘనిస్తాన్‌ జట్టు 40.1 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ జట్టు తుది వరకు పోరాడి విజయాన్ని దక్కించుకుంది. 44.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన నేపాల్‌ 149 పరుగులు సాధించడం ద్వారా విజయం సాధించింది. నేపాల్‌ జట్టులో కెప్టెన్‌ దేవ్‌ ఖానల్‌ 58(89) బాధ్యతాయుత ఇన్సింగ్‌ ఆడడంతో జట్టు విజయాన్ని నమోదు చేయగలిగింది. చివరిలో దీపక్‌ బోహరా 42 బంతుల్లో 27 పరుగులు చేయడంతో నేపాల్‌ జట్టు తుది వరకు పోరాడి విజయాన్ని దక్కించుకోగలిగింది. 

నేపాల్‌ బౌలర్ల విజృంభణ

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆప్ఘనిస్థాన్‌ జట్టు స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. 40.1 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్‌ బౌలర్లు విజృంభించడంతో అప్ఘనిస్థాన్‌ బ్యాటర్లకు స్కోర్‌ చేయడం కష్టమైంది. అప్ఘనిస్థాన్‌ మొదటి ముగ్గురు బ్యాటర్లలో ఇద్దరు డకౌట్‌ కాగా, ఓపెనర్‌ జంషెద్‌ జర్దాన్‌ 14 బంతులు ఆడి మూడు పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌ నుమాన్‌ షా ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్‌ కాగా, వన్‌ డౌన్‌లో వచ్చిన ఖైద్‌ తాన్విల్‌ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిడు. ఆ తరువాత వచ్చిన హసన్‌ ఎషకిల్‌ 20(35), షోహైల్‌ ఖాన్‌ జుమాతి 4(7), ఆలి అహ్మద్‌ డకౌట్‌ 0(1)గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ నాసీర్‌ ఖాన్‌ మార్ఫిఖిల్‌ కెప్టెన్‌ ఇన్సింగ్‌ ఆడడం ద్వారా జట్టు నామమాత్రపు స్కోరు సాధించేలా చేశాడు. 83 బంతులు ఆడిన నాసీర్‌ ఖాన్‌ మూడు ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. అల్లా ఘజాన్‌ఫర్‌ కూడా మెరుగైన ఇన్సింగ్‌ ఆడాడు. 21 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు సహాయంతో 37 పరుగులు సాధించాడు. ఆ తరువాత వచ్చిన అరబ్‌ గుల్‌ మోమద్‌ నాలుగు బంతులు ఆడి డకౌట్‌గా వెనుతిరగ్గా, ఫారిడాన్‌ దావోద్జాయ్‌ 65 బంతులు ఆడి 29 పరుగులు సాధించాడు. ఖలీల్‌ అహ్మద్‌ ఏడు బంతులాడి ఒక్క పరుగు చేయకుండా వెనుతిరిగాడు. మొత్తంగా ఆప్ఘానిస్థాన్‌ బ్యాటర్లలో ఐదుగురు డకౌట్‌ కాగా, నలుగురు మాత్రమే 20కుపైగా పరుగులు సాధించారు. నేపాల్‌ బౌలర్లలో అకాశ్‌ చాంద్‌ ఐదు వికెట్లతో ఆప్ఘనిస్థాన్‌ వెన్ను విరిచాడు. దీపేష్‌ కాందేల్‌ రెండు, తిలక్‌ బండారి, సుభాష్‌ బండారి, గుల్సా జా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

కెప్టెన్‌ ఇన్సింగ్‌తో విజయం

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ జట్టు విజయం కోసం తుది వరకు పోరాడాల్సి వచ్చింది. అప్ఘనిస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్‌ చేయడంతోపాటు వరుసగా వికెట్లు పడగొట్టడంతో నేపాల్‌ జట్టు ఒత్తిడికి లోనైంది. ఒకానొక దశలో ఆప్ఘానిస్థాన్‌ జట్టు విజయాన్ని నమోదు చేస్తుందనిపించింది. కానీ, ఆ జట్టు కెప్టెన్‌ దేవ్‌ ఖానల్‌ బాధ్యాతాయుతమైన ఇన్సింగ్‌ ఆడడంతో నేపాల్‌ జట్టు చివరి దశలో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌ జటట్టులో ఓపెనర్లు విఫలమయ్యారు. అర్జున్‌ కుమాల్‌ 10(14), వికెట్‌ కీపర్‌ బిపిన్‌ రావాల్‌ 2(19), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ గుల్సా జా 1(12) వికెట్లను త్వరగా కోల్పోవడంతో నేపాల్‌పై ఒత్తిడి పెరిగింది. ఆ తరువాత వచ్చిన కెప్టెన్‌ దేవ్‌ ఖానల్‌ 89 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయంతో 58 పరుగులు చేశాడు. ఆకాష్‌ త్రిపాఠి 16(39) సహాయంతో మరో వికెట్‌ పడకుండా స్కోరు బోర్డుపై పరుగులు వచ్చేలా చేయడం ద్వారా నేపాల్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు నేపాల్‌ను విజయం దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వరుసగా మళ్లీ వికెట్లను కోల్పోవడంతో నేపాల్‌ జట్టు కష్టాల్లో పడినట్టు అయింది. చివరలో వచ్చిన దీపక్‌ బోహరా 42 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టును విజయ తీరాలవైపు తీసుకెళ్లాడు. చివరిలో సుభాష్‌ బండారి ఫోర్‌ కొట్టడం ద్వారా జట్టుకు అపురూప విజయాన్ని అందించిపెట్టాడు. ఆప్ఘనిస్థాన్‌ బౌలర్లలో ఫరిదాన్‌ దావూద్జాయ్‌ మూడు, ఖలీల్‌ అహ్మద్‌ రెండు, నాసీర్‌ ఖాన్‌ మార్ఫుఖిల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అల్లాహ్‌ గంజాఫర్‌, అరబ్‌ గగుల్‌ మొమ్మద్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ఐదు వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌ చంద్‌ అందుకున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget