By : ABP Desam | Updated: 27 Jul 2021 09:56 AM (IST)
భారత స్టార్ జావలిన్ త్రోయర్ ప్లేయర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ కోసం టోక్యో బయల్దేరాడు. జపాన్‌కి బయల్దేరేముందు అతడు ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోను పంచుకున్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చాను జపాన్ నుంచి భారత్ చేరుకున్నారు.
భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ నిరాశపరిచాడు. సెమీఫైనల్ కోసం నిర్వహించిన పోటీల్లో అతను అర్హత సాధించలేకపోయాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజతం గెలుచుకుంది. ఐతే, ఈ రజతం... స్వర్ణమయ్యే అవకాశం ఉంది. అది ఎలాగంటే...స్వర్ణం గెలిచిన చైనా లిఫ్టర్ జీహుహోను డోపింగ్ టెస్టుకు పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ టెస్టులో ఆమె డోపీగా తేలితే ఆమె గెలిచిన స్వర్ణాన్ని చానుకు ఇచ్చేస్తారు.
ఒలింపిక్స్‌లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా పోరు ముగిసింది. సింగిల్స్ 3వ రౌండ్లో బాత్ర 0-4 తేడాతో ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియాపై ఓడిపోయింది.
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి చానుకు రాజ్యసభ్య శుభాకాంక్షలు తెలిపింది.
#Cheer4India #TokyoOlympics లో వెయిట్ లిఫ్టింగ్‌లో (49కేజీల విభాగం) రజత పతకం సాధించిన @mirabai_chanu కు రాజ్యసభ శుభాకాంక్షలు తెలియజేసింది. #Tokyo2020 @rajyasabhatv pic.twitter.com/YwS4Udef4D
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) July 26, 2021
పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పరాజయం పాలైంది. ఇండోనేషియాపై 21-13, 21-12 తేడాతో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ ఓడిపోయాడు. రష్య ఆటగాడు డానిల్ మెద్వైత్‌పై వరుసగా రెండు సెట్లలో ఓడిపోయాడు.
ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగా మొమిజి రికార్డు సష్టించింది.
జపాన్‌కి చెందిన 14 ఏళ్ల మొమిజి నిషియా బంగారు పతకం సాధించింది. స్కేట్ బోర్డింగ్‌లో ఆమె స్వర్ణం దక్కించుకుంది.
భారత ఏస్ షూటర్లు అహ్మద్, అంగద్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫికేషన్ కోసం నిర్వహించిన పోరులో వీరిద్దరూ 25, 18 స్థానాలతో సరిపెట్టుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల ఆర్చరీ జట్టు పోరు ముగిసింది. అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాజయం మూటకట్టుకుంది
ఒలింపిక్స్‌లో భారత ఏకైక ఫెన్సర్ భవానీ దేవి స్ఫూర్తిదాయక ప్రదర్శన ముగిసింది. తొలి రౌండ్లో ఘన విజయం సాధించిన ఆమె రెండో రౌండ్లో ఓటమి పాలైంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌తో పోరాడి వెనుదిరిగింది.
ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన బృందం ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. క్వార్టర్స్‌లో అత్యంత బలమైన, డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాతో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తే భారత్‌కు కచ్చితంగా పతకావకాశం ఉంటుందని చెప్పొచ్చు!
పురుషుల హాకీ రెండో మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. భారత్ 1-7తేడాతో ఓడిపోయింది
టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్‌లో మూడో రౌండ్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా మనిక బాత్రా నిలిచింది. ఈ రోజు జరిగిన రెండో రౌండ్లో ర్యాంకింగ్స్ లో తనకంటే మెరుగైన క్రీడాకారిణిన మనిక మట్టికరిపించింది. మూడో రౌండ్ గెలిస్తే మనికకు పతకం ఖాయమౌతోంది.
51 కేజీల మహిళల బాక్సింగ్ విభాగం తొలి రౌండ్లో మేరీ కోమ్ విజయం సాధించింది. డామినిక రిపబ్లిక్ క్రీడాకారిణి పై 4-1తేడాతో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.
టేబుల్ టెన్నిస్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో మనిక బాత్రా విజయం సాధించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి పై 4-3 తేడాతో గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది.
టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సత్యన్ రెండో రౌండ్లో ఓడిపోయాడు.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాజాగా క్రీడా మంత్రికి ఓ లేఖ రాసింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన క్రీడాకారులు తిరిగి భారత్‌లో అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా RT-PCR నెగిటివ్ వస్తేనే అనుమతి ఇవ్వాలని లేఖలో కోరింది.
పతకం గెలిచిన అనంతరం మీరాబాయ్ చాను మాట్లాడుతూ... తాను వెంటనే పిజ్జా తినాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో డామినోస్ పిజ్జా చానుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. లైఫ్ లాంగ్ మీరాబాయ్ చానుకు పిజ్జా ఫ్రీగా ఇస్తామని తెలిపారు.
@Mirabai_chanu Congratulations on bringing the medal home! 🙌🏽🥈You brought the dreams of a billion+ Indians to life and we couldn’t be happier to treat you to FREE Domino’s pizza for life 🍕😊
— dominos_india (@dominos_india) July 24, 2021
Congratulations again!! #DominosPizza #PizzasForLife #Tokyo2020 #MirabaiChanu https://t.co/Gf5TLlYdBi
పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత ఆటగాళ్లు దివ్యాన్ష్ పన్వార్, దీపక్ కుమార్ ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 32, 26 స్థానాలతో సరిపెట్టుకున్నారు.
Odisha | Using ice-cream sticks, 14-year-old Nandini Pattnaik from Puri dedicates a mini 'Tokyo Olympics stadium' to the Indian contingent participating in the games. "As a tribute to our players, I have created this miniature stadium using 8,000-10,000 sticks," she said (24.07) pic.twitter.com/72v4vMJKtV
— ANI (@ANI) July 24, 2021
బ్రిటీష్ టెన్నిస్ ఆటగాడు అండీ ముర్రే టోక్యో ఒలింపిక్స్‌లో సింగిల్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో రతజం సాధించిన భారత క్రీడాకారిణి మీరాబాయి చానుకు మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది
భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి ప్రణతి నాయక్ క్వాలిఫై రౌండ్లోనే వెనుదిరిగింది. ఆదివారం ఫైనల్ కోసం నిర్వహించిన మ్యాచ్‌లోనే ఆమె క్వాలిఫై అవ్వలేకపోయింది.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ వింబుల్డన్ ఛాంపియన్ బార్టీ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. స్పెయిన్ క్రీడాకారిణి సారా చేతిలో 4-6, 3-6 తేడాతో పరాజయం పాలైంది.
రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్, అర్వింద్ సింగ్ జంట దుమ్ము రేపింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో టాప్-3లో నిలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. జులై 27న ఈ పోటీలు జరగనున్నాయి.
టెన్నిస్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓటమిపాలైంది. ఉక్రెయిన్‌కు చెందిన కిచునాక్ లియుద్మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో ఓడిపోయింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు పతకం వేట స్టార్ట్ చేసింది. గ్రూప్-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు జయకేతనం ఎగరేసింది. [tw]
#Badminton : PV Sindhu beats Polikarpova 21-7, 21-10 in her opening match. #Tokyo2020 #Cheer4India #TeamIndia pic.twitter.com/xBkOJHolws
— All India Radio News (@airnewsalerts) July 25, 2021
[/tw]
భారత మహిళా హాకీ జట్టుకి మొదటి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. పటిష్టమైన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో ఓడింది భారత వుమెన్స్ హాకీ టీమ్.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత జూడో ప్లేయర్ సుశీలా దేవీ పోరాటం ముగిసింది. మహిళల 48 కేజీల విభాగంలో హంగేరియాన్ ఎవా సెనోవిక్‌జీతో జరిగిన 32 రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సుశీలా దేవి, పోటీ నుంచి నిష్కమించింది.
టీటీ మహిళల సింగిల్స్‌లో సుత్రీత ముఖర్జీ, స్విడెన్ ప్లేయర్ బెర్‌స్టోమ్‌తో జరిగిన మ్యాచ్ ఏడు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగించినా చివరకు విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది.
I am really happy on winning silver medal in #Tokyo2020 for my country 🇮🇳 pic.twitter.com/gPtdhpA28z
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 24, 2021
భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. 69 కేజీల మెన్స్ బాక్సింగ్ విభాగంలో జపాన్‌కి చెందిన ఒకాజవా మెన్షాతో జరిగిన మ్యాచ్‌లో వికాస్ కృష్ణన్ మూడు రౌండ్లలో ఓడి, ఒలింపిక్స్ నుంచి నిష్కమించాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన క్రీడాకారులకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పతకం గెలిచిన క్రీడాకారుల కోచ్‌లకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. స్వర్ణం గెలిచిన క్రీడాకారుడి కోచ్‌కి రూ.12.5లక్షలు, రజతం గెలిచిన క్రీడాకారుడి కోచ్‌కి రూ.10లక్షలు, కాంస్యం గెలిచిన క్రీడాకారుడి కోచ్‌కి రూ.7.5లక్షలు ఇవ్వనుంది.
1992 తర్వాత ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి రౌండ్లో గెలిచిన క్రీడాకారిణి మనికా బత్రా
అర్హత పోటీల్లో సత్తా చాటిన యువ షూటర్ సౌరభ్ చౌదరి.. రెండో ఎలిమినేషన్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీంతో పోటీ నుంచి నిష్క్రమించాడు.
టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత్ విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణి టిన్ టిన్ హోపై 4-0తో మనికా బాత్రా గెలుపొందింది. అయితే అంతకుముందు టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో శరత్ కమల్ - మనికా బాత్రా ద్వయం ఓటమిపాలైంది.
టెన్నిస్‌లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడు డెన్నిస్ ఇస్తోమిన్‌పై 6-4, 6-7, 6-4 తేడాతో నాగల్ గెలుపొందాడు. ఒలింపిక్ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో విజయం సాధించిన భారత మూడో ఆటగాడు ఇతడే కావడం విశేషం. అంతకుముందు 1988 సియోల్ గేమ్స్‌లో జీషన్ అలీ, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ సింగిల్స్ విభాగంలో విజయం సాధించారు. ఆ ఏడాది పేస్ కాంస్య పతకం కూడా సాధించాడు. 25ఏళ్ల తర్వాత నాగల్ మళ్లీ తొలి రౌండ్‌లో విజయం సాధించి ఒలింపిక్ పతకంపై ఆశలు రేపుతున్నాడు.
నిన్ను చూసి భారత్ గర్విస్తోంది
𝗠𝗜𝗥𝗔𝗕𝗔𝗜 𝗖𝗛𝗔𝗡𝗨!🥈👏🏻 🏋🏻♀️
— Sachin Tendulkar (@sachin_rt) July 24, 2021
Absolutely amazing display of weightlifting.
The way you have transformed yourself after your injury and clinched a historic silver for #TeamIndia is absolutely stupendous.
You have made 🇮🇳 very proud. #Tokyo2020 #Olympics pic.twitter.com/pacYIgQ7LK
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.
ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్ జోడీ 2-6 తేడాతో ఓటమిపాలైంది.
బ్యాడ్మింటన్ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత షట్లర్ సాయి ప్రణీత్ నిరాశపర్చాడు. ఇజ్రాయెల్ ఆటగాడు జిల్‌బర్మన్ మిషా చేతిలో 17-21, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. ఫస్ట్ అటెంప్ట్‌లో 110 కేజీలు, సెకండ్ అటెంప్ట్‌లో 115 కేజీలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. ఫైనల్ అటెంప్ట్‌లో మాత్రం 117 కేజీలను లిప్ట్ చేయడంలో మీరాబాయి విఫలమైంది. దాంతో.. ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనాకి చెందిన హౌ జిహూయ్‌కి స్వర్ణం లభించింది.
భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ఇప్పటికే ప్రకటించేసింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
/body>