Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు.
Serena Williams on Retirement: ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ కాలేదని మాజీ నెం.1 టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ప్రకటించారు. త్వరలోనే కోర్టుకు తిరిగి వస్తానని కూడా ఆమె తెలిపారు. గత నెలలో యుఎస్ ఓపెన్ తర్వాత, సెరెనా మళ్లీ టెన్నిస్ కోర్టులో కనిపించరని అంతా అనుకున్నారు.
తాను రిటైర్ కాలేదని సెరెనా విలియమ్స్ శాన్ ఫ్రాన్సిస్కో విలేకరుల సమావేశంలో చెప్పారు. తాను తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. సెరెనా యుఎస్ ఓపెన్ తర్వాత మరే ఇతర టోర్నమెంట్స్‌కు ప్రిపేర్ కావడం లేదు. 'నేను ఏ టోర్నమెంట్‌కు ఆడకపోవడం నా జీవితంలో ఇదే తొలిసారి. ఇది కూడా వింతగా ఉంది, కానీ నేను ఇంకా రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదని చెప్పగలు."
2022 ఆగస్టు ప్రారంభంలో సెరెనా టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఓ పోస్టు ఇన్‌స్టాలో పెట్టారు. తాను టెన్నిస్‌కు దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఆ పోస్టు తర్వాత, యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్లో చివరి టోర్నమెంట్‌గా చాలా మంది అనుకున్నారు. ఈ గ్రాండ్ స్లామ్‌లో ఆమె మూడో రౌండ్‌లో నిష్క్రమించారు. ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టోమ్లిజెనోవిచ్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టారు. ఆ టైంలో ఆమె వెళ్లిపోయిన తీరు, ఒక క్రీడాకారిణిగా ఆమె కెరీర్ ముగిసిందని విశ్లేషణలు గట్టిగా వినిపించాయి. అభిమానుల నుంచి క్రీడ, కళా దిగ్గజాల వరకు అంతా ఆమెకు రిటైర్మెంట్ సందేశాలు పంపించారు. అప్పటి నుంచి ఆమె రిటైర్మెంట్‌కు సంబంధించి చాలా ఊగిసలాట కొనసాగింది. రిటైర్ అవుతున్నారా లేదా అనేదానిపై క్లారిటీ మాత్రం రాలేదు. ఇన్నాళ్లు ఇప్పుడు దీనిపై ఆమె ఓ ప్రకటన చేశారు.
23 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన సెరెనా
విలియమ్స్ టెన్నిస్ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్ లో మొత్తం 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. సెరెనా 1995లో తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించారు. ఆమె గత 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా టెన్నిస్ ఆడుతున్నారు. అత్యధిక సింగిల్స్ గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు.