అన్వేషించండి

SLvIND: తొలి టీ20లో 38 పరుగుల తేడాతో భారత్ విజయం

కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 38 పరుగుల తేడాతో శ్రీలంకని ఓడించింది.

ఇప్పటికే వన్డే సిరీస్‌ను చేజెక్కించుకున్న టీమిండియా టీ20 సిరీస్‌లోనూ బోణి కొట్టింది. కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 38 పరుగుల తేడాతో శ్రీలంకని ఓడించింది.


SLvIND: తొలి టీ20లో 38 పరుగుల తేడాతో భారత్ విజయం

మొదట సూర్యకుమార్ యాదవ్ (50: 34 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీ బాదడంతో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం భువనేశ్వర్ కుమార్ (4/22), దీపక్ చాహర్ (2/24) చెలరేగడంతో శ్రీలంక 126 పరుగులకే కుప్పకూల్చింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్ కొలంబో వేదికగానే మంగళవారం రాత్రి 8 గంటలకి ప్రారంభంకానుంది.

165 పరుగుల లక్ష్య ఛేదనని శ్రీలంక పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు మినోద్ భానుక (10: 7 బంతుల్లో 2x4), అవిష్కా ఫెర్నాండో (26: 23 బంతుల్లో 3x4) తక్కువ స్కోర్లకే వికెట్లు చేజార్చుకున్నారు. 3వ వచ్చిన ధనంజయ డిసిల్వా (9: 10 బంతుల్లో 1x4) కూడా ఫెయిలయ్యాడు. కానీ.. చరిత అసలంక (44: 26 బంతుల్లో 3x4, 3x6) కాసేపు దూకుడుగా ఆడి గెలుపు ఆశలు రేపాడు. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని అతను సిక్సర్లు బాదాడు. ప్రమాదకరంగా మారిన అసలంకని ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఔట్ చేసిన దీపక్ చాహర్.. అదే ఓవర్‌లో హసరంగా(0)ని క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ని భారత్‌ వైపు తిప్పాడు.
 
ఇక చివర్లో కరుణరత్నె (3), ఇసుర ఉదాన (1)తో పాటు చమీరా (1)లను ఔట్ చేసేసిన భువనేశ్వర్ కుమార్ 18.3 ఓవర్లలోనే శ్రీలంక ఇన్నింగ్స్‌కి ముగింపు పలికేశాడు. స్పిన్నర్లు కృనాల్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, చాహల్ తలో వికెట్ పడగొట్టగా.. హార్దిక్ పాండ్యాకి కూడా ఓ వికెట్ దక్కింది. మొత్తంగా ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేయగా.. అందరికీ వికెట్లు పడటం గమనార్హం. శ్రీలంక చివర్లో కేవలం 15 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు చేజార్చుకుంది.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. మొదట బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా.. తొలి బంతికే పృథ్వీ షా (0) రూపంలో వికెట్ చేజార్చుకుంది. అయితే.. నెం.3లో వచ్చిన సంజు శాంసన్ (27: 20 బంతుల్లో 2x4, 1x6) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడుతూ కనిపించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ (46: 36 బంతుల్లో 4x4, 1x6) స్లోగా స్టార్ట్ చేశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ నుంచి శిఖర్ ధావన్ గేర్ మార్చగా.. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేశాడు. దాంతో 14 ఓవర్లు ముగిసే సమయానికి 113/2తో నిలిచిన భారత్ మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. ఓవర్ వ్యవధిలో శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ ఔటవగా.. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్యా (10: 12 బంతుల్లో) తేలిపోయాడు. అయితే.. చివర్లో ఇషాన్ కిషన్ (20 నాటౌట్: 14 బంతుల్లో 1x4, 1x6) విలువైన పరుగులు చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget