Rahul Dravid Comments: క్లీన్‌స్వీప్ ఓటమి మాకు కనువిప్పు.. టీమిండియా దారుణ వైఫల్యంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే..!
కేప్‌టౌన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో దీపక్ చాహర్ మెరుపులతో దాదాపు విజయం ఖాయమైందనుకున్న సమయంలో అతడు ఔట్ కావడంతో కేవలం 4 పరుగుల తేడాతో టీమిండియాపై దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది.
Rahul Dravid Comments On Team Indias 3-0 Lose: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. చివరి వన్డేలోనైనా నెగ్గి కనీసం విజయంతో సిరీస్ ముగించాలని భావించిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. కేప్‌టౌన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో దీపక్ చాహర్ మెరుపులతో దాదాపు విజయం ఖాయమైందనుకున్న సమయంలో అతడు ఔట్ కావడంతో కేవలం 4 పరుగుల తేడాతో టీమిండియాపై దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.
మూడో వన్డేలో ఓటమి, సిరీస్ క్లీన్ స్వీప్ ఓటమిపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ సిరీస్ ఓటమి మాకు కనువిప్పు లాంటిది. యువ ఆటగాళ్లు చాలా ధైర్యంగా ప్రదర్శన చేశారు. ఓటమిపాలైనప్పటికీ వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించడం ఆనందంగా ఉంది. కోచ్‌గా తొలి వన్డే సిరీస్‌లో ప్రయోగాలు చేశాం. ప్రపంచకప్ ఆడేందకు చాలా సమయం ఉంది. మేం స్ట్రాంగ్‌గా తిరిగొస్తాం. లోపాలను త్వరలోనే సరిదిద్దుకుని సందర్భానుసారం ఆడేందుకు ప్లాన్ చేస్తామని రాహుల్ ద్రావిడ్ అన్నాడు.
ఓటమిపై ద్రావిడ్ ఏమన్నాడంటే..
మిడిల్ ఓవర్లలో ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. పరిస్థితులు అర్థం చేసుకున్నాక సైతం మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ సరిగా చేయలేదు. మిడిలార్డర్‌లో ఆడే ఆటగాళ్లు సెలక్షన్ సమయంలో అందుబాటులో లేరు. వారు జట్టుతో చేరితో సమస్య తీరినట్లే. ఇందువల్లే బ్యాటింగ్ ఆర్డర్‌లో మేం మార్పులు చేయాలని అంతగా భావించలేదు. అదే క్రమంలో బ్యాటింగ్ లైనప్ ఉంచితే ఆటగాళ్లకు సైతం అవకాశాలు రావడంతో పాటు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఛాన్స్ ఇస్తేనే ఆటగాళ్ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించేందుకు అవకాశం ఉంటుందన్నాడు ద్రావిడ్.
కేఎల్ రాహుల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఇప్పుడే మొదలుపెట్టాడు. సాధ్యమైనంత వరకు తన పని బాధ్యతగా చేసినట్లు కనిపించాడు. ఓటముల నుంచి అతడు నేర్చుకుని భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు అందిస్తాడని హెడ్ కోచ్ ద్రావిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు సాధించడంపై ఫోకస్ చేస్తేనే ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టేందుకు వీలవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు అంశాల్లోనూ మిడిల్ ఓవర్లలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ట్రై చేస్తామన్నాడు.
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా 4 పరుగులతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. భారత వన్డే క్రికెట్ చరిత్రలో సిరీస్ వైట్ వాష్ కావడం ఇది కేవలం మూడో సారి మాత్రమే. కెప్టెన్సీ చేసిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన మొదటి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.
Also Read: Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!