అన్వేషించండి

Rahul Chahar mariage: ఫ్యాషన్ డిజైనర్ను పెళ్లాడిన క్రికెటర్‌ రాహుల్‌ చాహర్‌ - గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పిక్స్‌ చూస్తారా?

Rahul chahar weds Ishani johar: క్రికెటర్‌ రాహుల్‌ చాహర్‌ తన ఫియాన్సీ ఇషానీ జోహార్‌ను పెళ్లి చేసుకున్నాడు. మార్చి 9న గోవాలో వీరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేడుక జరిగింది.

Rahul Chahar Marries Ishani Johar In Goa: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రాహుల్‌ చాహర్‌ (Rahul Chahar) ఓ ఇంటివాడయ్యాడు! ఫ్యాషన్ డిజైనర్‌, తన ఫియాన్సీ ఇషానీ జోహార్‌ను (Ishani Johar) పెళ్లి చేసుకున్నాడు. మార్చి 9న గోవాలో వీరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 12న రిసెప్షన్‌ ఉంటుందని సమాచారం. 2019లో ఇషానీతో రాహుల్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అప్పటి నుంచీ ఈ ప్రేమ పక్షులు కలిసి విహరిస్తున్నాయి!

తమ పెళ్లి వేడుక గురించి రాహుల్‌ చాహర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'Our Happily ever after!!' అంటూ కామెంట్‌ పెట్టాడు. మెహందీ ఫంక్షన్‌, పెళ్లి వేడుక చిత్రాలను పంచుకున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

ప్రస్తుత రాహుల్‌ చాహర్‌ వయసు 22 ఏళ్లు. టీమ్‌ఇండియా తరఫున ఈ యువ స్పిన్నర్‌ 6 టీ20 మ్యాచులాడి ఏడు వికెట్లు తీశాడు. 2021లో శ్రీలంకతో ఆడిన ఒక వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి ఆశ్చర్యపరిచాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో రాహుల్‌ చాహర్‌ మస్తు క్రేజ్‌ ఉంది. 2017లో అతడు రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. 2018లో అతడిని ముంబయి ఇండియన్స్‌ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు 42 ఐపీఎల్‌ మ్యాచులు ఆడిన రాహుల్‌ చాహర్ 42 వికెట్లు తీశాడు. చివరి సీజన్లో 11 మ్యాచుల్లో 24.46 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.

తన బౌలింగ్‌తో క్రీజులో ఉన్న బ్యాటర్లను రాహుల్‌ చాహర్ సులువగా బోల్తా కొట్టిస్తాడు. కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులను తిప్పుతూ పరుగులను నియంత్రిస్తాడు. ఆదమరిస్తే వికెట్‌ లాగేసుకుంటాడు. ఈ సీజన్లో అతడు పంజాబ్‌ కింగ్స్‌కు ఆడబోతున్నాడు. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో అతడిని రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

టాప్ హెడ్ లైన్స్

BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget