అన్వేషించండి

PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్

బతుకమ్మ ఫోటోలపై నెటిజన్ చేసిన విమర్శలకు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు హుందాగా సమాధానమిస్తూ, విమర్శించే ముందు కుటుంబ సంప్రదాయాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పీవీ సింధు బతుకమ్మ ఫోటోలపై నెటిజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
  • తన పుట్టింట్లో సంప్రదాయం లేదని, పూల బతుకమ్మను తనే పేర్చింది.
  • వెండి బతుకమ్మ అత్తగారు ఇచ్చిన బహుమతి, సంప్రదాయం గౌరవిస్తుంది.

హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ విషయంలో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ చేసిన కామెంట్లకు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్యాడ్మింట్ స్టార్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగానే నిర్ణయించిన గేమ్స్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది బతుకమ్మ సంబరాలను మిస్ అవుతున్నానంటూ పీవీ సింధు ఓ పోస్ట్ చేశారు. గతేడాది పెళ్లయిన కొత్తలో తన భర్తతో కలిసి జరుపుకున్న వేడుకల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్నారు. అయితే ఆ ఫొటోల్లో సింధు చేతిలో వెండి బతుకమ్మ ఉండటాన్ని గమనించిన ఓ నెటిజన్... పూలు పేర్చితేనే బతుకమ్మ అని, మీ చేతులో ఉన్నది ఏంటి..  మీ పైత్యాన్ని సంప్రదాయాలపై, ప్రజలపై రుద్దకండి అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ నెటిజన్ ట్రోలింగ్‌పై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఏమాత్రం తగ్గకుండా హుందాగా స్పందిస్తూ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ అతడి నోరు మూయించారు. ఒకరిపై విమర్శలు గుప్పించే ముందు ఆ కుటుంబ సంప్రదాయాలు, భావోద్వేగాలను, పద్దతుల్ని అర్థం చేసుకోవాలని ఆమె హితవు పలికారు. తన పుట్టింట్లో బతుకమ్మ ఆడే ఆచారం లేదని తెలిపారు. కరీంనగర్‌కు చెందిన కుటుంబానికి కోడలిగా తాను వెళ్లిన తర్వాతే ఈ బతుకమ్మ పండుగతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. వైరల్ అయిన ఫొటోలో వెనుకవైపు కనిపిస్తున్న పెద్ద బతుకమ్మను తనే స్వయంగా రోజంతా కష్టపడి రంగురంగుల పూలతో పేర్చానని తెలిపారు. ఆ పూల బతుకమ్మ స్వయంగా తయారు చేసి తాను వేడుకల్లో పాల్గొన్నానని స్పష్టం చేశారు. 

ఇక చేతిలో ఉన్న వెండి బతుకమ్మ విషయం ఏంటని కొందరికి డౌట్ వస్తుంది. తనను ఆప్యాయంగా తెలంగాణ సంప్రదాయంలోకి ఆహ్వానిస్తూ తన అత్తింటివారు (అత్తగారు) ప్రేమతో ఇచ్చిన కానుక పీవీ సింధు సోషల్ మీడియా ద్వారా వివరించారు. తనకు సంస్కృతి, సాంప్రదాయంతో పాటు కుటుంబ ప్రేమానుబంధాలకు కూడా విలువ ఇస్తానని సింధు సోషల్ మీడియాలో ఇచ్చిన వివరణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తాను పెద్ద సెలబ్రిటీని, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో రెండుసార్లు భారత్‌కు మెడల్ అందించాననే తీరును ప్రదర్శించకుండా.. ఓ సాధారణ మహిళగా మన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆ ఫొటోకు కారణం వివరిస్తూ నెటిజన్‌కు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Frequently Asked Questions

పీవీ సింధు బతుకమ్మ విషయంలో ఎందుకు విమర్శలు ఎదుర్కొన్నారు?

ఆమె పంచుకున్న బతుకమ్మ ఫోటోలలో చేతిలో ఉన్న వెండి బతుకమ్మను చూసి కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూలతో పేర్చినదే బతుకమ్మ అని వారు వాదించారు.

విమర్శలకు పీవీ సింధు ఎలా సమాధానం ఇచ్చారు?

ఇతరులపై విమర్శలు చేసే ముందు వారి కుటుంబ సంప్రదాయాలు, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని ఆమె హితవు పలికారు. తన పుట్టింట్లో బతుకమ్మ ఆడే ఆచారం లేదని వివరించారు.

పీవీ సింధు చేతిలో ఉన్న వెండి బతుకమ్మ వెనుక ఉన్న కథ ఏమిటి?

ఆ వెండి బతుకమ్మను తన అత్తగారు తెలంగాణ సంప్రదాయంలోకి ఆహ్వానిస్తూ ప్రేమతో ఇచ్చిన కానుక అని సింధు వివరించారు. పూల బతుకమ్మను మాత్రం తానే స్వయంగా పేర్చానని తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Malinga, Mhambrey Exit:  మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
 మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
WPL Expansion: ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. WPLలో కొత్త టీమ్‌ల ఎంట్రీ, సైకియా సంచలన ప్రకటన
ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. WPLలో కొత్త టీమ్‌ల ఎంట్రీ, సైకియా సంచలన ప్రకటన
Ferguson, Henry Blow: కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
Embed widget