అన్వేషించండి

Pranavi Urs Gold Triumph: గోల్ఫ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన మైసూర్ అమ్మాయి.. ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్‌కు మహిళల వ్యక్తిగత స్వర్ణం, అదితీ, దీక్షలతో కలిసి రజతం కైవసం

ఆసియా క్రీడల గోల్ఫ్ విభాగంలో ప్రణవి ఉర్స్ అద్భుత ప్రదర్శనతో మహిళల వ్యక్తిగత స్వర్ణంతో పాటు టీమ్ విభాగంలో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

Mysuru Golfer Clinches Historic Individual Gold And Team Silver In Nagoya:  జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా గోల్ఫ్ సరికొత్త శిఖరాలను అధిరోహించింది. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన 23 ఏళ్ల స్టార్ గోల్ఫర్ ప్రణవి ఉర్స్ అసాధారణ ప్రతిభతో ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్‌కు మొట్టమొదటి మహిళల వ్యక్తిగత గోల్ఫ్ స్వర్ణ పతకాన్ని అందించింది. తుది రౌండ్‌లో మూడో హోల్ వద్ద ట్రిపుల్ బోగీ పడి ఆధిక్యం కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని 6వ, 10వ, 13వ హోల్స్‌లో మూడు బర్డీలు సాధించింది. 72వ హోల్ వద్ద బంతిని సమర్థవంతంగా పార్ చేసి నాలుగు రౌండ్లలో కలిపి మొత్తం 15 అండర్ 265 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

చైనాకు చెందిన యిన్ రువోనింగ్ రజతం సాధించగా, సింగపూర్‌కు చెందిన షానన్ టాన్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. వ్యక్తిగత స్వర్ణంతో పాటు అదితి అశోక్, దీక్షా దాగర్‌లతో కూడిన భారత జట్టుకు సారథ్యం వహించి 14 అండర్ 546 స్కోరుతో టీమ్ విభాగంలో రజత పతకాన్ని సాధించి పెట్టింది. ఈ విభాగంలో చైనా జట్టు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. "ఏదైనా సాధించడంలో మొదట నిలవడం నాకు ఎంతో ఇష్టం. భవిష్యత్తులో చాలామంది రికార్డులు సాధించవచ్చు, కానీ చరిత్రలో మొదటి వ్యక్తి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం" అని ప్రణవి తన చిరస్మరణీయ విజయం తర్వాత తెలిపింది.

24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. చారిత్రక రికార్డు సమం
గోల్ఫ్ క్రీడలో భారత్‌కు స్వర్ణ పతకం దక్కడం 2002 బుసాన్ ఆసియా క్రీడల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. నాడు పురుషుల వ్యక్తిగత విభాగంలో శివ్ కపూర్ స్వర్ణం సాధించాడు. ఇక మహిళల గోల్ఫ్‌లో గత హాంగ్జౌ క్రీడల్లో అదితి అశోక్ సాధించిన రజతమే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఇప్పుడు ప్రణవి ఏకంగా పసిడి పతకాన్ని ముద్దాడి ఆ రికార్డును తిరగరాసింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో లక్ష్మణ్ సింగ్ వ్యక్తిగత గోల్డ్ సాధించి, అమిత్ లుత్రా, రాజీవ్ మోహతాలతో కలిసి టీమ్ స్వర్ణాన్ని గెలిచిన తర్వాత, ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన అరుదైన భారత గోల్ఫర్‌గా ప్రణవి చరిత్రకెక్కింది.

అదితి అశోక్ మెరుపులు.. సమష్టిగా పోరాడిన భారత త్రయం
వ్యక్తిగత విభాగంలో గత రజత పతక విజేత అదితి అశోక్ ఆఖరి రౌండ్‌లో వరుసగా ఐదు బర్డీలతో చెలరేగి 67 స్కోరు నమోదు చేసింది. మొత్తం రెండు ఓవర్ 282 స్కోరుతో వ్యక్తిగత విభాగంలో 14వ స్థానంలో నిలిచింది. మరో ప్లేయర్ దీక్షా దాగర్ 23వ స్థానంతో సరిపెట్టుకుంది. నిబంధనల ప్రకారం అత్యుత్తమ రెండు స్కోర్లను పరిగణనలోకి తీసుకుని భారత మహిళల జట్టుకు రజత పతకాన్ని ప్రకటించారు. ఆసియా క్రీడల చరిత్రలోనే భారత మహిళల గోల్ఫ్ జట్టు నమోదు చేసిన అత్యుత్తమ టీమ్ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.

ఆరేళ్ల వయసులోనే గోల్ఫ్ స్టిక్ పట్టి.. అర్జున అవార్డు విజేతగా ప్రణవి
2003 ఏప్రిల్ 15న మైసూర్‌లో జన్మించిన ప్రణవి ఉర్స్, తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆరేళ్ల వయసు నుంచే గోల్ఫ్ ఆడటం ప్రారంభించింది. జూనియర్ సర్క్యూట్‌లో పలు టైటిళ్లు సాధించి 2020లో ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారింది. 2023లో భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్న ప్రణవి, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ లేడీస్ యూరోపియన్ టూర్‌లో రాణిస్తూ, 2025లో పురుషుల గోల్ఫర్లతో జరిగిన ప్రొఫెషనల్ ఓపెన్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. తాజా ఆసియా క్రీడల డబుల్ మెడల్ ఫీట్‌తో భారత క్రీడారంగంలో సరికొత్త లెజెండ్‌గా నిలిచింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anuj Shrivatri Centenary: ఇండియా 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవాత్రి చారిత్రక రికార్డు, మధ్యప్రదేశ్ నుంచి తొలి ప్లేయర్ గా కొత్త చరిత్ర
ఇండియా 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవాత్రి చారిత్రక రికార్డు, మధ్యప్రదేశ్ నుంచి తొలి ప్లేయర్ గా కొత్త చరిత్ర
Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget