అన్వేషించండి

అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ప్రారంభం, ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ

37th National Games: కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి.

గోవాలో 37వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి. క్రీడల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా, మల్లకంబ్‌ విన్యాసాలు అబ్బురపరిచాయి. గోవా ముఖ్యమంత్రి  ప్రమోద్ సావంత్‌తో కలిసి గోల్ఫ్ జీపులో ప్రయాణిస్తూ ఫతోర్డాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోకి వచ్చిన ప్రధాని మోదీ 37వ జాతీయ క్రీడలను లాంఛనంగా ఆరంభించారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, విండ్‌సర్ఫర్‌ కాత్యా ఇడా ఈ జ్యోతిని తీసుకువెళ్లి ప్రధానికి అందించారు. అనంతరం జాతీయ క్రీడలు ఆరంభమైనట్లు ప్రధాని అధికారికంగా ప్రకటించారు. జాతీయ క్రీడల నిర్వహణకు గోవా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మోదీ కొనియాడారు. ఈ క్రీడా మౌలిక సదుపాయాలు గోవా యువతకు ఉపయోగపడతాయని అన్నారు.

అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి  భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2036లో ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి హామీ కూడా ఇచ్చామని ప్రధాని తెలిపారు. దేశంలో క్రీడా ప్రతిభకు లోటు లేదని ఎంతో మంది ఛాంపియన్లను భారత్  అందించిందని  మోదీ తెలిపారు. క్రీడాకారులకు ఆర్థికంగా అండగా  ఉండేందుకు  ప్రభుత్వం పథకాలు అమలు చేస్తొందన్నారు. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం క్రీడలపై ఖర్చును మూడు రెట్లు పెంచిందని మోదీ గుర్తు చేశారు. దేశంలో క్రీడలు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో గోవాలో ఈ క్రీడలు జరగడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, ఎంతోమంది ఛాంపియన్‌లను దేశం తయారు చేసిందని మోదీ అన్నారు. చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా పతకాలు సాధించిన క్రీడాకారులు... ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. 

ఆసియా క్రీడల్లో వందకుపైగా పతకాలతో 70 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టామని, ఆసియా పారా గేమ్స్‌లోనూ భారత ఆటగాళ్లు 70కి పైగా పతకాలు సాధించి గత రికార్డులన్నింటినీ తిరగరాశారని మోదీ అన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా ఆటగాళ్లను తయారు చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారు చేశామన్న మోదీ... దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. 

జాతీయ క్రీడలు యువ క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి వేదికన్న ప్రధాని.. అథ్లెట్లు పాత రికార్డులను బద్దలు కొట్టాలని సూచించారు. అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణను అందించేందుకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 3,000 మంది యువకులు శిక్షణ పొందుతున్నారని మోదీ వెల్లడించారు. ఖేలో ఇండియాలో ప్రతిభ సృష్టిస్తున్నామని, వీరికి ఏడాదికి రూ.6 లక్షల స్కాలర్‌షిప్‌ ఇస్తారని తెలిపారు. ఖేలో ఇండియా నుంచి 125 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో యువతే ప్రధానమని పేర్కొన్న మోదీ, అక్టోబర్ 31న ‘మేరా యువ భారత్’ పేరుతో కొత్త వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

గోవాలో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. నవంబర్ 9 వరకు ఇవి కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు జాతీయ క్రీడల్లో పాల్గొననున్నారు. జాతీయ క్రీడల్లో మొత్తం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget