MIW Vs RCBW Toss: టాస్ గెలిచిన స్మృతి - బ్యాటింగ్‌కే మొగ్గు - భారీ స్కోరు చేయడానికి రెడీ అవుతున్న బెంగళూరు!
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
![MIW Vs RCBW Toss: టాస్ గెలిచిన స్మృతి - బ్యాటింగ్‌కే మొగ్గు - భారీ స్కోరు చేయడానికి రెడీ అవుతున్న బెంగళూరు! MIW Vs RCBW: Royal Challengers Bangalore Women Won the Toss Against Mumbai Indians Women Chose to Bat First MIW Vs RCBW Toss: టాస్ గెలిచిన స్మృతి - బ్యాటింగ్‌కే మొగ్గు - భారీ స్కోరు చేయడానికి రెడీ అవుతున్న బెంగళూరు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/06/aaa772c8e914f1dbc3996bcb06015ecd1678110315069252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mumbai Indians Women vs Royal Challengers Bangalore Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ వైపు మొగ్గు చూపింది.
ఈ రెండు జట్లలో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్‌లో భారీ విజయం సాధించగా, బెంగళూరు ఓటమి పాలైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం బెంగళూరుకు చాలా కీలకం. బెంగళూరు తన తుదిజట్టులో ఒక మార్పు చేసింది. గత మ్యాచ్ ఆడిన ఆశా శోభన స్థానంలో శ్రేయాంక పాటిల్ జట్టులోకి వచ్చింది.
ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
యస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు (ప్లేయింగ్ XI)
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్
విమెన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ మ్యాచులో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జోరు చూస్తే వారెవ్వా అనాల్సిందే. స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో సమతూకంగా కనిపించింది. ఒకరితో మరొకరు పోటీపడి మరీ బ్యాటింగ్ చేశారు. సిక్సర్లు కొట్టడంలో తమకు సాటిలేదన్నట్టుగా ఆడేశారు. కెప్టెన్ హర్మన్ హాఫ్ సెంచరీతో జోష్‌లో ఉంది. పైగా కెప్టెన్సీలో తనది అందవేసిన చేయి. కోరుకున్న క్రికెటర్లంతా ఉన్నారు. దాంతో టైటిల్ రేసులో ఉన్నట్టే కనిపిస్తోంది. హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, అమెలియా కౌర్ నుంచి మెరుపులు ఆశించొచ్చు. పూజా వస్త్రాకర్, ఇస్సీవాంగ్, హమైరా కజీ భారీ షాట్లు ఆడేయగలరు. దాదాపుగా 10 నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలరు. అటు పేస్, ఇటు స్పిన్ డిపార్ట్‌మెంట్ అత్యంత పటిష్ఠంగా ఉంది.
తొలి మ్యాచులో ఘోర ఓటమి నుంచి బలంగా పుంజుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టుదలగా ఉంది. నిజానికి దిల్లీ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోవాల్సిన జట్టేమీ కాదు. విదేశీ క్రికెటర్లు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టొచ్చు. స్మృతి మంధాన, సోఫీ డివైన్‌లో ఎవరో ఒకరు భారీ స్కోరు చేయడం ఖాయం. మిడిలార్డర్లో హేథర్ నైట్, దిశా, ఎలిస్ పెర్రీ మంచి భాగస్వామ్యాలు అందించాల్సి ఉంది. రిచా ఘోష్ తన స్థాయికి తగినట్టు సిక్సర్లు బాదితే తిరుగుండదు. కనిక, ఆశా, ప్రీతి, మేఘన్, రేణుక షాట్లు ఆడగలరు. పేస్ ఫర్వాలేదు కానీ స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో అనుభవ లేమి కనిపిస్తోంది. ఇందుకోసం ఎక్స్ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న డేన్‌వాన్ నీకెర్క్‌ను తీసుకోవచ్చు. కెప్టెన్సీ పరంగా మంధానకు మరింత అవగాహన, నేర్పరితనం అవసరం.
బ్రబౌర్న్ పిచ్ ఫ్లాట్‌గా ఉంది. పేసర్లు, స్పిన్నర్లు సరైన లెంగ్తుల్లో బంతులు వేస్తే వికెట్లు పడగొట్టగలరు. బౌండరీలు చిన్నవిగా ఉన్నాయి. బ్యాటర్లు సులభంగా 60 మీటర్ల దూరం బంతుల్ని పంపించగలరు. భారీ స్కోర్లు చేస్తుండటం, ముంబయి, ఆర్సీబీ మ్యాచ్ కావడంతో స్టేడియం నిండే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)