అన్వేషించండి

Madras High Court: ధోనీ పరువునష్టం కేసు.. ఆ ఐపీఎస్ అధికారికి జైలుశిక్ష

MS Dhoni Defamation Case : మహేం ద్ర సింగ్​ ధోనీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు.

మహేంద్ర సింగ్​ ధోనీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. ధోనీ విషయంలో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ అతనికి  15 రోజులు జైలు శిక్షను విధించింది. సంపత్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ జస్టిస్​ ఎస్​ఎస్​ సుందర్​, జస్టిస్​ సుందర్​ మోహన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే.. ఈ శిక్షను న్యాయస్థానంలో సవాల్​ చేసుకునేందుకు వీలుగా  అమలును  30 రోజుల వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు.

అసలేం జరిగింది అంటే 

2013లో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్​ ఫిక్సింగ్​కు, క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీకి ముడిపెడుతూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు. ఆ అధికారి తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా తన 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  ధోనీ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని టీవీ యాజమాన్యానికి, ఐపీఎస్ అధికారి సంపత్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై టీవీ ఛానల్ ఇచ్చిన వివరణను  కోర్టు కొట్టివేసింది. ధోనీ లాంటి అంతర్జాతీయ క్రికెటర్​పై వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఈ  సందర్భంగా కోర్టు సూచించింది.  మరోవైపు ఐపీఎస్​ అధికారి సంపత్​ఇచ్చిన వివరణతో  ధోనీ సంతృప్తి చెందలేదు. ఆయన ఇచ్చిన వివరణలో సుప్రీం కోర్టు, హైకోర్టుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్‌పై చర్యలు తీసుకోవాలని మరోసారి మద్రాస్ హైకోర్టును ధోనీ కోరాడు. ఈ పిటిషన్‌ను  విచారించిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను పైకోర్టులో సవాల్​చేసుకునేందుకు వీలుగా 30 రోజుల వరకు శిక్ష అమలును నిలుపుదల చేస్తూ అదేశాలు జారీ చేసింది.

భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరూ ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనీకి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తరువాత  జెర్సీ నంబర్ 10 రిటైర్ అవుతున్నట్లు గతంలోనే  బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవం  ఇచ్చింది. అంటే ఇక పై  భారత జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకోలేరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget