Lionel Messi: PSGతో మెస్సీ రెండేళ్ల అగ్రిమెంట్... ఏడాదికి సుమారు రూ.300కోట్లు!
మెస్సీ ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (PSG)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కొద్ది రోజుల క్రితం బార్సిలోని ఫుట్‌బాల్ క్లబ్‌కి గుడ్ బై చెప్పిన మెస్సీ ... పారిస్ సెయింట్ జర్మన్ (PSG)తో అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. లయెనల్ మెస్సీ ఇక ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్–1లో కనిపించనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జర్మన్ (PSG)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి PSG దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు 610 కోట్లు.
A new 💎 in Paris !
— Paris Saint-Germain (@PSG_inside) August 10, 2021
PSGxMESSI ❤️💙 pic.twitter.com/2JpYSRtpCy
AlsoRead: Chris Cairns: వెంటిలేటర్ పై మాజీ క్రికెటర్... కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు
ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ... ‘మరో ఛాంపియన్స్ లీగ్ గెలవడం నా కల. దాన్ని నెరవేర్చుకోవడానికి నేను సరైన ప్లేస్‌లోనే ఉన్నానని అనుకుంటున్నాను’ అని మెస్సీ అన్నాడు. చివరిసారి 2015లో బార్సిలోనా టీమ్‌లో మెస్సీ తన చివరి యురోపియన్ టైటిల్‌ను మెస్సీ గెలిచాడు. PSG మాత్రం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఛాంపియన్స్ లీగ్ గెలవలేదు. పీఎస్‌జీ ఏడాదికి 3.5 కోట్ల యూరోలు (సుమారు రూ.300 కోట్లు) మెస్సీకి చెల్లించనున్నట్లు సమాచారం. మెస్సీ లాంటి స్టార్ ప్లేయర్ తమ టీమ్‌లో చేరుతుండటంతో పీఎస్‌జీ అభిమానులు అతనికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికే బ్రెజిల్‌కు చెందిన నెయ్‌మార్ కూడా ఇదే టీమ్‌లో ఉన్నాడు.
అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. తన 17 ఏళ్ల వయసులో 2004లో బార్సిలోనా క్లబ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. వివిధ లీగుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బార్సిలోనా క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్ సాధించాడు మెస్సీ.
AlsoRead: Watch: అంతరిక్షంలో ఒలింపిక్స్... ఎలా ఆడుతారో చూస్తారా?
🔛📽️ - 𝐉𝐨𝐮𝐫 1⃣
— Paris Saint-Germain (@PSG_inside) August 10, 2021
❤️💙 #PSGxMESSI pic.twitter.com/SngjpDiueb
AlsoRead: Lionel Messi: బార్సిలోనాకి గుడ్ బై... PSGతో మెస్సీ కొత్త అగ్రిమెంట్?