By: ABP Desam | Updated at : 06 Aug 2021 04:25 PM (IST)
ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ పేరును ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు. ఇకపై దీనిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ వేదికగా తెలిపారు.
I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award!
Jai Hind! pic.twitter.com/zbStlMNHdq
‘ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని భారతదేశం నలుమూలల నుంచి నాకు వినతులు వస్తున్నాయి. అభిప్రాయాలు వెల్లడించిన వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఖేల్ రత్న అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తాం. జై హింద్’అంటూ ట్వీట్ చేశారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జయంతి అయిన ఆగస్ట్ 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Major Dhyan Chand was among India’s foremost sportspersons who brought honour and pride for India. It is fitting that our nation’s highest sporting honour will be named after him.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92లో ఏర్పాటు చేశారు. ఈ పురస్కారం క్రింద రూ.25 లక్షలు నగదు బహుమతి ఇస్తారు. చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌కి మొట్టమొదటసారి ఈ పురస్కారం అందజేశారు. టెన్నీస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ధన్‌రాజ్ పిళ్లై, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారి జాబితలో ఉన్నారు.
మేజర్ ధ్యాన్ చంద్ ఫీల్డ్ హాకీ ప్లేయర్. ఆయన 1926 నుంచి 1949 వరకు అంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్నారు. తన కెరీర్‌లో 400కు పైగా గోల్స్ స్కోర్ సాధించారు. 1928, 1932, 1936లలో ఒలింపిక్స్ బంగారు పతకాలను గెలుచుకున్న ఇండియన్ హాకీ టీమ్‌లో ఆయన సభ్యుడు.
క్రీడా రంగంలో జీవితకాల సాఫల్యం సాధించిన వారికి ధ్యాన్ చంద్ అవార్డును ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిని 2002లో ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని ఓ స్టేడియంకు కూడా 2002లో ధ్యాన్‌చంద్ పేరు పెట్టారు.
Team India: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ , ఘన స్వాగతం పలికిన అభిమానులు
Mushfiqur Rahim: అలా జరిగిపోయిందంతే , కావాలని చేతితో బంతిని ఆపలేదు
Rishabh Pant: ఐపీఎల్ బరిలో రిషభ్ పంత్ , తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్
Brian Lara : రాసిపెట్టుకోండి... గిల్ ఒక్కడికే సాధ్యం, లారా ప్రశంసల జల్లు
BAN vs NZ, 2nd Test: తొలి రోజే నేలకూలిన 15 వికెట్లు , ఆసక్తికరంగా బంగ్లా-కివీస్ రెండో టెస్ట్
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>