అన్వేషించండి

India Enters Finals: మహిళల డిస్కస్‌త్రో ఫైనల్‌కు కమల్‌ప్రీత్‌ కౌర్‌ అర్హత

కమల్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ లో డిస్కస్ త్రో ఫైనల్ కు అర్హత సాధించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ పతకం పై ఆశలు రేపింది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కి అర్హత సాధించి రికార్డు నెలకొల్పింది. శనివారం ఉదయం ఫైనల్ కోసం నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్లో అద్భుత ప్రదర్శన చేసిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. 

మరోవైపు భారీ అంచనాలతో అడుగుపెట్టిన మరో త్రోయర్ సీమా పూనియా 16వ స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. ఇక అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్‌ 66.42 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. కమల్‌ప్రీత్‌ 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించింది.

కాగా, ఫైనల్‌ పోటీ ఆగస్టు 2న ఉదయం 5.30గంటలకు ప్రారంభంకానుంది. అక్కడ మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్‌ ఫైనల్లోనూ ఇలాంటి మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌కు మరో పతకం ఖాయమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కమల్‌ప్రీత్‌ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు, రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్‌ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు సాధించి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. 

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే క్రీడాకారిణులు 64మీటర్లు డిస్కస్ త్రో చేయాలి. ఎవరైతే 64 మీటర్లు సాధిస్తారో వారు నేరుగా ఫైనల్లో చోటు సంపాదించినట్లే. లేదంటే అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్‌ 12 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఇక 16వ స్థానంలో నిలిచి ఇంటిముఖం పట్టిన పూనియా 60.57 మీటర్లే డిస్కస్‌ త్రో చేయగలిగింది.

కమల్‌ప్రీత్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే ఆమె రెండుసార్లు 65 మీటర్లను చేరుకొని జాతీయ అత్యుత్తమ రికార్డు నెలకొల్పింది. మార్చిలో నిర్వహించిన ఫెడరేషన్‌ కప్‌లో ఆమె 65.06 మీట్ల దూరం విసిరి భారత్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేసింది. అలాగే జూన్‌లో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి-4 ఈవెంట్‌లో తన రికార్డును తనే బద్దలుకొట్టింది.

నెదర్‌లాండ్స్‌ క్రీడాకారిణి జోరిండ్‌ వాన్‌ క్లింకెన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో విఫలమైంది. ఆమె 61.15 మీటర్లతోనే సరిపెట్టుకొని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. అమెరికా క్రీడాకారిణి అల్మన్‌ తొలి స్థానంలో నిలిచింది. రియో , లండన్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, క్రొయేషియాకు చెందిన సాండ్రా పెర్కోవిక్ 63.75 మీటర్లు విసిరింది.

దీంతో రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ ఒలింపిక్ ఛాంపియన్ సాండ్రా పెర్కోవిక్ బెస్ట్ కంటే కమల్‌ప్రీత్ దే అత్యుతమ త్రో గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లో అడుగు పెట్టింది కమల్ ప్రీత్. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్ కౌర్ టోక్యో ఒలంపిక్స్ మైదానంలో అద్భుతం సృష్టించింది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Impact Player Rule : ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఇండియ‌న్ కెప్టెన్ ఫైర్: రూల్ తో ఆ ప్ర‌మాదమ‌ని హెచ్చ‌రిక‌!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఇండియ‌న్ కెప్టెన్ ఫైర్: రూల్ తో ఆ ప్ర‌మాదమ‌ని హెచ్చ‌రిక‌!
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్ వర్సెస్ అలిస్సా హీలీ: స్టార్క్ రాకపై సోషల్ మీడియాలో రచ్చ.. అసలేమైందంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్ వర్సెస్ అలిస్సా హీలీ: స్టార్క్ రాకపై సోషల్ మీడియాలో రచ్చ.. అసలేమైందంటే?
RCB vs SRH IPL 2026: ఐపీఎల్ 2026 నేడు ప్రారంభం! ఆర్‌సిబి, ఎస్‌ఆర్‌హెచ్ జట్లతో పోరు షురూ! తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026 నేడు ప్రారంభం! ఆర్‌సిబి, ఎస్‌ఆర్‌హెచ్ జట్లతో పోరు షురూ! తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ఇషాన్ కిషన్
IPL 2026 : ఆర్‌సీబీకి వరుస షాకులు: ఐపీఎల్ 2026 నుండి స్టార్ బౌలర్ అవుట్.. బౌలింగ్ కష్టాల్లో బెంగళూరు!
ఆర్‌సీబీకి వరుస షాకులు: ఐపీఎల్ 2026 నుండి స్టార్ బౌలర్ అవుట్.. బౌలింగ్ కష్టాల్లో బెంగళూరు!

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Rishab Shetty : వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
Best Courses After Intermediate : ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
Embed widget