అన్వేషించండి

IPL 2024: దేశవాళీ క్రికెట్‌లో దంచిపడేసిన మెక్‌గుర్క్‌కు లైఫ్‌ ఇచ్చిన హ్యారీ బ్రూక్‌

Jake Fraser McGurk: ఢిల్లీ తరపున బరిలోకి దిగిన  జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. వరుసగా మూడు సిక్సులు కొట్టి సత్తా చాటాడు. ఇంతకీ ఎవరది.

Who is Delhi Capitals batter Jake Fraser McGurk: ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG)కు ఢిల్లీ(DC) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.  వరుసగా మూడు విజయాలతో మంచి ఊపు మీదున్న లక్నోకు పంత్‌ సేన ఝులక్‌ ఇచ్చింది. తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి సాధికార విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఇచ్చిన షాక్‌తో.. లక్నో విజయాలకు బ్రేక్‌ పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర కుర్రాడు  జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ తరపున బరిలోకి దిగిన  జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. కృనాల్‌ పాండ్యా వేసిన ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి సత్తా చాటాడు. అరంగేట్ర మ్యాచ్‌లో ఎదుర్కొన్న రెండో బంతినే స్టాండ్స్‌లోకి పంపి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఇంతకీ ఎవరీ జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ అని అందరూ ఆరా తీస్తున్నారు.


ఆసిస్ నుంచే..
ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి జేక్ అడుగుపెట్టాడు. అదే ఏడాది లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. బిగ్‌బాష్‌లోనూ అదరగొడుతున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌-2020 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 550 పరుగులు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 525 పరుగులు మెక్‌గుర్క్ చేశాడు. గతేడాదిలో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తప్పుకోవడంతో మెక్‌గుర్క్‌కు రూ. 50 లక్షల బేస్‌ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

లక్నోపై గెలుపు ఇలా...
లక్నో విధించిన 168 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీకి పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు... పృథ్వీ షా-వార్నర్‌ 23 పరుగుల జోడించారు. ఎనిమిది పరుగులు చేసిన వార్నర్‌ను యశ్‌ ఠాకూర్ బౌల్డ్‌ చేసి లక్నోకు బ్రేక్‌ ఇచ్చాడు. కానీ పృథ్వీ షా, జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ ఢిల్లీని విజయం దిశగా నడిపించారు. రవి బిష్ణోయ్‌ వేసిన ఏడో ఓవర్‌లో 32 పరుగులు చేసిన పృథ్వీ ఔటయ్యాడు. పృథ్వీ అవుటైనా   మెక్‌గర్క్‌ ధాటిగా ఆడాడు. 13వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను ఢిల్లీ వైపునకు తిప్పేశాడు. కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో మెక్‌గర్క్‌ 55 పరుగులు చేసి నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఢిల్లీ వైపు పయనించింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా అప్పటికే లక్ష్యం కరిగిపోయింది. స్టబ్స్‌, హోప్స్‌ మిగిలిన పనిని పూర్తి చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
Natarajan Homecoming Trade: సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
Rishabh Pant Homecoming Strategy: ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget