IPL 2025 DC VS KKR Result Update: KKR అద్భుత విజయం, రాణించిన రఘువంశీ, నరైన్ -డుప్లెసిస్ పోరాటం వృథా, చేజేతులా ఓడిన ఢిల్లీ
డిఫెండింగ్ ఛాంపియన్ స్థాయికి తగ్గట్టుగా ఆడిన కేకేఆర్.. ఈ సీజన్లో నాలుగవ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై అన్ని రంగాల్లో రాణించి, ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

IPL 2025 KKR 4th Victory: ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ సత్తా చాటుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ పై 14 పరుగులతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశి (32 బంతుల్లో 44, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.బౌలర్లలో మిషెల్ స్టార్ట్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లేసెస్ స్టన్నింగ్ ఫిఫ్టీ (45 బంతుల్లో 62, 7 ఫోర్లు,2 సిక్సర్లు) తో రాణించాడు. బౌలర్లలో నరైన్ కి మూడు వికెట్లు తీసుకున్నాడు.
తుఫాను ఆరంభం.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతాకు ఓపెనర్లు సునీల్ నారైన్ (27), రెహమానుల్లా గుర్బాజ్ (26) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ బౌండరీలతో ముందుకు సాగడంతో కోల్కతాకి 10 పరుగులకు పైగా రన్ రేట్ తో ఫ్లయింగ్ స్టార్ట్ లభించింది. జోరుగా కొనసాగుతున్న కోల్కతాకి గుర్బాజ్ అవుట్ కావడంతో చిన్నపాటి బ్రేక్ తగిలింది.ఆ తర్వాత నరైన్ కాసేపు క్రీజులో గడిపి తను కూడా వెనుతిరిగాడు.ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రఘువంషి తన విలువెంటో మరోసారి చాటి చెప్పాడు. కీలకమైన పరుగులు జత చేసి కోల్కతాకి కు రన్ రేట్ పడిపోకుండా చూశాడు. మరో ఎండులో తనకు లభించిన లైఫ్ ని సద్వినియోగం చేసుకున్న రింకు సింగ్ (36) కూడా చెలరేగిపోయాడు. వీరిద్దరి బ్యాటింగ్ తో కోల్కతా ఇన్నింగ్స్ తో వడివడిగా సాగింది. వేగంగా స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఆఖరిలో చేరిన స్టార్క్ వరుసగా వికెట్లు తీసి ఒక దశలో హ్యాట్రిక్ ముందు నిలిచాడు. అయినా కానీ అతను ఆ ఘనత సాధించలేకపోయాడు. మిగతా బౌలర్లలో విప్రజ్ నిగమ్, కెప్టెన్ అక్షర్ పటేల్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
జోరుగా చేజింగ్..
ఓవర్ కు పది పరుగులపైగా రన్ రేట్ తో బ్యాటింగ్ ను ప్రారంభించిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ అభిషేక్ పోరెల్ (4) త్వరగానే అవుట్ అయ్యాడు.ఈ దశలో ముందుగా డూప్లెసిస్.. కరణ్ నాయర్ (15)తో కలిసి ఉపయుక్తమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ చాన్సులు తీసుకొని స్కోరుబోర్డును పరుగులెత్తించారు. అలాగే రిక్వైర్డ్ తగ్గకుండా చూశారు. ఈ నేపథ్యంలో వేగంగా ఆడి 25 బంతుల్లోనే 39 పరుగులు జత చేశారు.ఈ దశలో దురదృష్టవశాత్తు కరణ్ ఎల్బీగా అవుట్ అవ్వడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (7) కూడా రనౌట్ కావడంతో ఢిల్లీ కాస్త ఒత్తిడిలో పడింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (43) తో అలరించాడు. వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, బౌండరీలు బాది రిక్వయిర్డ్ రన్ రేట్ పడి పోకుండా చూశాడు. మరో ఎండులో పాతుకపోయిన డూప్లెసిస్ కాస్త వేగంగా ఆడుతూ 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.వీరిద్దరూ నాలుగో వికెట్ కు 76 పరుగులు జోడించడంతో ఢిల్లీ ఛేదన వైపు వడివడిగా సాగింది. అయితే అక్షర్ పటేల్ ఔటయ్యాక పరిస్థితి తిరిగ బడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. చివర్లో విప్రజ్ నిగమ్ (38) పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి.
ఐపీఎల్ న్యూస్, ఐపీఎల్, క్రికెట్ న్యూస్, ఢిల్లీ క్యాపిటల్స్, ఫాప్ డు ప్లేసెస్,అక్షర పటేల్, అంగ్ క్రిష్ రఘువంశి, మిషెల్ స్టార్క్.
IPL,IPL news, Cricket news, Delhi capitals,Kolkata Knight Riders, Michelle Starc, Faf du plessisA,ngkrish Raghuvamshi, Indian Premier League




















