అన్వేషించండి
Advertisement
IPL 2024:హైదరాబాద్ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
SRH vs RCB, IPL 2024: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
SRH vs RCB IPL 2024 Sunrisers Hyderabad target 207: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అర్ధ శతకాలతో చెలరేగిన వేళ హైదరాబాద్ ముందు బెంగళూరు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కానీ సొంత మైదానంలో ఈ స్కోరుతో హైదరాబాద్‌ను బలహీన బౌలింగ్ ఉన్న బెంగళూరు ఆపగలదా అన్నది ప్రశ్నగా మారింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
కోహ్లీ, పాటిదార్ ఇద్దరే
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. విరాట్ ధాటిగా ఆడలేకపోయాడు. కోహ్లీని ఉనద్కత్ అవుట్ చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. డుప్లెసిన్‌ను నటరాజన్ అవుట్ చేశాడు. 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రజత్ పాటిదార్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు బ్యాటింగ్ చేశాడు. పాటిదార్ 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కానీ రజత్ పాటిదార్‌ను కూడా ఉనద్కత్ పెవిలియన్ చేర్చాడు. లామ్రోర్.. నాలుగు బంతులు ఆడి ఏడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తిక్ కూడా నిరాశపరిచాడు. ఆరు బంతుల్లో రెండు ఫోర్లతో 11 పరుగులే చేసి కమిన్స్ బౌలింగ్‌లో దినేశ్ కార్తిక్ పెవిలియన్‌కు చేరాడు. వరుసగా వికెట్లు పడుతున్నా కామెరూన్ గ్రీన్ బెంగళూరుకు ఆపద్భాందవుడిగా మారాడు. గ్రీన్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చివర్లో స్వప్నిల్ సింగ్ ఆరు బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో నిల్చొన్న గ్రీన్.. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒక వికెట్ మాత్రమే తీసి 55 పరుగులు సమర్పించుకున్నాడు. మార్కండే ఒక వికెట్ తీయగా... నటరాజన్ కూడా ఒక వికెట్ తీశాడు. బలంగా ఉన్న హైదరాబాద్ బ్యాటర్లను 207 పరుగుల లక్ష్యాన్ని బలహీనంగా బెంగళూరు బౌలింగ్‌తో ఆపగలదా అన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తిరుపతి
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement