అన్వేషించండి

Threat to Kohli: కోహ్లీ ప్రాణానికి ముప్పు! మంగళవారం ప్రాక్టీస్ ఆపేసిన RCB - అసలేం జరిగింది

ఇండియన్ స్టార్ క్రికెటర్, ఆర్ సీ బీ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉందన్న సమాచారంతో ఆర్ సీ బీ మంగళవారం ప్రాక్టీస్ చేయడం మానేసింది.

ఫైనల్ కు ముందు ఆడే అతి పెద్ద సమరం ఎలిమినేటర్. ఇందులో ఓడితే  ‘ఈ సలా కప్ నమ్మదే’ అనే కల మరచి పోవాల్సిందే.  ప్రత్యర్థి సాదా సీదా జట్టు కాదు. అయినా ఆర్ సీ బీ ఈ ఎలిమినేటర్ కు ముందు ఉన్న ఎకైక ప్రాక్టీస్ సెషన్ కు ఎగ్గొట్టేసింది. ఎందుకో తెలుసా..? 

బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ లో తలపడనున్న ఆర్ సీ బీ మంగళవారం తమకున్న ఏకైక ప్రాక్టీస్ సెషన్ ను వదులుకుంది.  ఆర్ సీ బీ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాణానికి ముప్పుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.. అసలేమైందంటే..

మంగళవారం గుజరాత్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్ సీ బీ జట్టు హోటల్ రూములకే పరిమితమైంది. కనీసం జట్టు ఆటగాళ్లు ప్రెస్ మీట్ ‌కి సైతం హాజరు కాలేదు. దీనికి కారణం తీవ్రమైన సెక్యూరిటీ థ్రెట్ గా చెబుతున్నారు. అది కూడా విరాట్ కోహ్లీ ప్రాణానికి ముప్పుండటమే అసలు కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయమై టెర్రరిస్టులుగా అనుమానిస్తున్న నలుగుర్ని పోలీసులు అరెస్టు చేసినట్లు  కూడా వార్తలొస్తున్నాయి. 

అయితే ఈ సెక్యూరిటీ థ్రెట్ గురించి ఆర్ సీ బీ, ఆర్ ఆర్ రెండు టీములకూ పోలీసులు  సమాచారం ఇచ్చారు. ఆర్ సీ బీ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు తమకున్న అన్ని కమిట్ మెంట్లను క్యాన్సిల్ చేసుకోగా..  రాజస్థాన్ రాయల్స్ మాత్రం తమ షెడ్యూలును యధావిధిగా కొనసాగించినట్లు చెబుతున్నారు. 

దీనిపై పోలీస్ ఉన్నతాధికారి విజయ్ సింఘా జ్వాలా బుధవారం మాట్లాడారు.  ‘‘ విరాట్ కోహ్లీ దేశానికే విలువైన నిధి లాంటి వాడు. అతను అహ్మదాబాద్ ‌కి రాగానే  తన ప్రాణానికి ముప్పుందనే విషయం అతనికి చెప్పాం. అతని సెక్యూరిటీ మాత్రమే మాకు ప్రస్తుతం చాలా ముఖ్యం. ఆర్ సీ బీ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రాక్టీస్ సెషన్ ఉండదని టీమ్ యాజమాన్యం చెప్పేసింది. విషయం ఆర్ ఆర్ టీముకు కూడా చెప్పాము.  వాళ్లు మాత్రం యధా విధిగా తమ షెడ్యూల్ కొనసాగించారు’’ అని జ్వాలా చెప్పారు. 

ఈ నేపథ్యంలో ఆర్ సీ బీ ఆటగాళ్లు ఉన్న హోటల్ రూమ్ బయట పోలీసులు నిఘా పెంచారు. ఐపీఎల్ కి సంబంధించిన వ్యక్తులను కూడా హోటల్ రూముల్లోకి అనుమతించట్లేదు. ఆర్ ఆర్ ఆటగాళ్లకు కూడా ప్రాక్టీస్ కి వెళ్లేందుకు గ్రీన్ కారిడార్ పేరిట ప్రత్యేక భద్రతా వలయం ఏర్పాటు చేశారు. అయితే యజ్వేంద్ర చహాల్, అశ్విన్,రియాన్ పరాగ్ వంటి ఆటాళ్లు ప్రాక్టీస్ కి రాకుండా హోటల్ లోనే ఉన్నట్లు తెలుస్తోెంది. ఆర్ ఆర్ కెప్టన్ సంజూ శాంసన్ కూడా ప్రాక్టీస్ కు లేట్ గా వచ్చినట్లు చెబుతున్నారు. బుధవారం కూడా ఆర్ సీబీ  ఆర్ ఆర్ మ్యాచ్ కు సెక్యూరిటీ గణనీయంగా పెంచనున్నట్లు సమాచారం.  

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Comeback Story: టీమ్‌లోనే చోటు లేదన్నారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెనే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్
ఆ..యా..షేర్..! టీమ్‌లో చోటు లేదన్నారు.. ఏకంగా కెప్టెన్ అయ్యాడు శ్రేయస్ 
Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget