అన్వేషించండి

IPL 2024: తేలిపోయిన రాజస్థాన్‌ బ్యాటర్లు, పంజాబ్‌ ముందు స్వల్ప లక్ష్యం

RR vs PBKS, 2024: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్లు తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే చేతులెత్తేసారు.

RR vs PBKS IPL 2024  Punjab Kings target 145: పంజాబ్‌(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌(RR) తక్కువ పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన రాజస్థాన్‌ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. పంజాబ్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాజస్థా బ్యాటర్లు ఏ దశలోనూ భారీ స్కోరు సాధించేలా కనిపించలేదు. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులకే పరిమితమైంది. రియాన్‌ పరాగ్‌ 48 పరుగులతో రాణించాడు. 

చెలరేగిన బౌలర్లు
 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. మొదటి బంతికి ఫోర్ బాదిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతిని వికెట్ల మీదికి ఆడుకుని అవుట్‌ అయ్యాడు. నాలుగు పరుగులకే చేసి జైస్వాల్‌ అవుటయ్యాడు. జైస్వాల్‌ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి వికెట్లకు తగిలింది. దీంతో తొమ్మిది పరుగులకే రాజస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత సంజు శాంసన్, టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ కాసేపు పంజాబ్‌ బౌలర్లను ప్రతిఘటించారు. కానీ పరుగులు మాత్రం రాలేదు. పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్థాన్‌ స్కోరు 38/1. ఆ తర్వాత కాసేపటికే 18 పరుగులు చేసిన శాంసన్ అవుటయ్యాడు. దీంతో 40 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్ కోల్పోయింది.  15 బంతుల్లో కెప్టెన్ సంజు శాంసన్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు.  నాథన్ ఎలిస్ వేసిన 6.4 ఓవర్‌కు బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి శాంసన్‌ అవుటయ్యాడు. 7 ఓవర్లకు స్కోరు 41/2. కాసేపటికే రాజస్థాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ చాహర్ ఓవర్‌లో భారీ షాట్ ఆడి కాడ్‌మోర్ లాంగాన్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. 8 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోరు 43/3. 9 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోరు 50 పరుగులు దాటింది. 10 ఓవర్లకు రాజస్థాన్‌ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ వేసిన 11 ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌కు అశ్విన్ ఊపు తెచ్చాడు.  రాహుల్ చాహర్ వేసిన 12 ఓవర్‌లో అశ్విన్ వరుసగా 6, 4, 4 బాదాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 13 ఓవర్‌లో చివరి బంతికి 28 పరుగులు చేసి అశ్విన్ అవుటయ్యాడు. దీంతో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో రాజస్థాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. శామ్‌ కరన్ వేసిన 14 ఓవర్‌లో మూడో బంతికి ధ్రువ్ జురెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. జురెల్.. మిడ్‌ వికెట్‌లో హర్‌ప్రీత్ బ్రార్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రాహుల్ చాహర్ వేసిన 15  ఓవర్లో మూడో బంతికి రొవ్‌మన్ పావెల్ నాలుగు పరుగులు చేసి అవటయ్యాడు. కానీ రియాన్‌ పరాగ్‌ పోరాడాడు. రాజస్థాన్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా పరాగ్‌ చివరి వరకూ పోరాడాడు. రియాన్‌ పరాగ్‌ 48 పరుగులు చేయడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget