RCB vs LSG IPL 2023: లక్నో, బెంగళూరు మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం - ఆట ఆగే సమయానికి కష్టాల్లో ఆర్సీబీ!
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
Punjab Kings vs Royal Challengers Bangalore: ఐపీఎల్ సీజన్‌లో 43వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (40 నాటౌట్: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), దినేష్ కార్తీక్ (1 నాటౌట్: 3 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
Rain stops play in Lucknow 🌧️
— IndianPremierLeague (@IPL) May 1, 2023
Stay tuned for further updates.#TATAIPL | #LSGvRCB
Some light rain here in Lucknow, and the players are going off. 😞 pic.twitter.com/3TPGRn4JhD
— Lucknow Super Giants (@LucknowIPL) May 1, 2023
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (31: 30 బంతుల్లో, మూడు ఫోర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (40 నాటౌట్: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) నిదానంగా ఆడారు. కానీ కావాల్సిన స్టార్ట్ అయితే దొరికింది. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ భారీ షాట్ కొట్టబోయి స్టంపౌట్ అయ్యాడు.
విరాట్ అవుటయ్యాక వచ్చిన అనుజ్ రావత్ (9: 11 బంతుల్లో), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4: 5 బంతుల్లో), సుయాష్ ప్రభుదేశాయ్ (6: 7 బంతుల్లో) కూడా ఘోరంగా విఫలం అయ్యారు. దినేష్ కార్తీక్ (1 నాటౌట్: 3 బంతుల్లో) క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ ఇప్పటికే జరిగింది. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి లక్నో విజయం సాధించింది. దీంతో ప్రతీకార విజయం కోసం బెంగళూరు ఎదురు చూస్తుంది. పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ తేడాతో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 4కు చేరే అవకాశం ఉంది. అదే లక్నో గెలిస్తే వారు మొదటి స్థానానికి వెళ్తారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, వైశాక్, బ్రేస్‌వెల్, సోను యాదవ్.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆయుష్ బదోని, డేనియల్ సామ్స్, అవేష్ ఖాన్, క్వింటన్ డి కాక్, ప్రేరక్ మన్కడ్.