అన్వేషించండి

SRH vs RR IPL 2024 Qualifier 2: పోరాడిన క్లాసెన్ , రాజస్థాన్‌ లక్ష్యం 176

SRH vs RR IPL 2024 Qualifier 2: రెండవ క్వాలిఫ‌య‌ర్ లో భాగంగా చెన్నై చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో హైద‌రాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.

SRH vs RR  IPL 2024 Qualifier 2: రాజస్థాన్ రాయల్స్(RR) తో జరుగుతున్నప్లే ఆఫ్ సమరంలో హైదరాబాద్(SRH) పోరాడే స్కోర్ చేసింది.  పిచ్ బౌలింగ్ కి అనుకూలిస్తున్న వేళ రొటీన్ కి భిన్నంగా,  ఓపిగ్గా ఆడిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాటర్లు పర్వాలేదనిపించే స్కోర్ చేశారు. 4 బంతుల్లో 4 సిక్స్‌లతో హెన్రిచ్‌ క్లాసెన్  అర్ధ శతకంతో మెరవగా రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  కానీ  ఎలాంటి భారీ  భాగస్వామ్యాలు  నెలకొల్పలేక పోయారు.  రాజస్థాన్ జట్టు  బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు, అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తియ్యగా , సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. 

మెరిసిన హెన్రిచ్‌ క్లాసెన్

రెండవ  క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో కోల్‌కతాతో టైటిల్‌ కోసం తలపడనున్న నేపధ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ  బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే మొదటి   ఓవర్‌లోనే హైదరాబాద్ కు  భారీ షాక్ తగిలింది.  ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన అభిషేక్ శర్మ  12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద  ఔటయ్యాడు. అయితే రాహుల్  త్రిపాఠి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో 37 పరుగులు చేసి  చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తరువాత మక్రమ్ కూడా వెంటనే అవుట్ అవ్వడంతో మొదటి 5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. వరుస 3 వికెట్లు  బౌల్ట్ పడగొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి  స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 68/3.  7 వ ఓవర్ నుంచో హైదరాబాద్‌ బ్యాటర్లు నిలకడగా ఆడారు. 10 వ ఓవర్ లో హైదరాబాద్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34 పరుగులకే  ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ ఔటైన తర్వాత హైదరాబాద్ స్కోరు మందగించింది. నితీశ్ రెడ్డి 5 పరుగులకే పెవిలియన్ చేరగా,  అబ్దుల్ సమద్ డకౌటయ్యాడు. ప్ర‌ధాన ఆట‌గాళ్లంతా అటూ ఇటుగా ఆడి చేతులెత్తేసిన వేళ ట్రావీస్  హెడ్ స్థానంలో  ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ 18 రన్స్ చేశాడు. 18 వ ఓవర్ లో  క్లాసెన్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే చివరిలో సందీప్ శర్మ క్లాసెన్ ను అవుట్ చేసి రెండవ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి ఓవర్ అవేశ్ ఖాన్ వేయగా చెరో 5 పరుగులతో ప్యాట్ క‌మిన్స్, ఉనాద్కాట్‌ లు 6 ర‌న్స్ తీశారు. దాంతో, హైద‌రాబాద్ 9 వికెట్ల న‌ష్టానికి 175 పరుగులు చేసింది.   రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget