అన్వేషించండి

IPL 2024: చేతులెత్తేసిన పంజాబ్‌ బ్యాటర్లు, రాజస్థాన్‌ లక్ష్యం 148

PBKS vs RR: ఐపీఎల్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లు రాణించారు.   రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.

PBKS vs RR  IPL 2024 Rajasthan target 148: ఐపీఎల్‌(IPL)  పంజాబ్‌(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌(RR) బౌలర్లు రాణించారు. పంజాబ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రాజస్థాన్‌ బౌలర్లు సమర్థంగా రాణించారు.  రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బ్యాటర్లలో ఒక్కరే 30 పరుగుల మార్క్‌ను దాటారు. పంజాబ్‌ బ్యాటర్లలో అషుతోష్‌ శర్మ ఒక్కడే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. జితేశ్‌ శర్మ ఒక్కడే 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు,  ఆవేశ్‌ ఖాన్‌ రెండు, కుల్దీప్‌ సేన్‌, చాహల్‌ చెరో వికెట్‌ తీశారు.
 
రాజస్థాన్‌ బౌలర్ల జోరు...
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందే అని కాసేపటికే అర్థమైంది. 27 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. అధర్వను అవుట్‌ చేసి ఆవేశ్‌ఖాన్‌... పంజాబ్‌కు తొలి షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత పంజాబ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. 15 పరుగులు చేసి అథర్వ,  15 పరుగులు చేసి జానీ బెయిర్‌ స్టో పెవిలియన్‌కు చేరారు. జానీ బెయిర్‌ స్టోను కేశవ్‌ మహరాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్‌సింగ్ 10, కెప్టెన్‌ శామ్‌ కరణ్‌ ఆరు, జితేశ్ శర్మ 29, గత మ్యాచుల్లో రాణించిన శశాంక్‌ సింగ్‌ 9 త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు. జితేశ్‌ శర్మ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పిట్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో... రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకపోవడంతో పంజాబ్‌ బ్యాటర్లు భారీ షాట్లు ఆడక తప్పలేదు. చివర్లో అషుతోష్‌ శర్మ బ్యాట్‌ ఝుళిపించడంతో పంజాబ్‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది. అషుతోష్ శర్మ  11 బంతుల్లో ఒక ఫోరు, మూడు సిక్సులతో 31 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్‌ బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు,  ఆవేశ్‌ ఖాన్‌ రెండు, కుల్దీప్‌ సేన్‌, చాహల్‌ చెరో వికెట్‌ తీశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్‌ బౌలర్లు సత్తా చాటి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తారేమో చూడాలి.
 
పంజాబ్‌ గాడిన పడేనా..?
శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్‌ ఇప్పటివరకూ అయిదు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ వారికి కీలకంగా మారనుంది. అయిదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కెప్టెన్ కరణ్‌ ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది. పంజాబ్ బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. రాయల్స్ బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉన్న వేళ రబాడ దళం వీరిని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget