అన్వేషించండి

IPL 2024: హోంగ్రౌండ్‌లో ముంబై అదిరే రికార్డు

Mumbai Indians Make History: ముంబై హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్ లో 150 మ్యాచ్ లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.

Mumbai Indians Make History Become First Team To Win 150 T20 Matches: ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లో.. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(MI) తొలి విజయం నమోదు చేసింది. తొలుత ముంబై బ్యాటర్లు జూలు విదల్చగా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో ముంబై బ్యాటర్‌ రొమారియో  షెఫర్డ్‌ ఏకంగా 32 పరుగులు రాబట్టి హార్దిక్‌ సేనకు భారీ స్కోరు అందించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది. పృథ్వీ షా, స్టబ్స్‌ రాణించినా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రోహిత్ (49), ఇషాన్ (42) మంచి ఆరంభాన్ని అందించారు. చివర్లో టిమ్ డేవిడ్ (45నాటౌట్), షెఫర్డ్ (39నాటౌట్) రాణించడంతో ముంబై స్కోర్ 234 కు చేరింది. 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో పృథ్వీ (66), స్టబ్స్ (77) ఆఫ్ సెంచరీలు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు. 
అరుదైన రికార్డు
ముంబై హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.  హోం గ్రౌండ్ లో ముంబై జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. టీ20 క్రికెట్ లో 150 మ్యాచ్ లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై తరువాత ఆ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది. ఆ జట్టు మొత్తం 148 మ్యాచ్ లను గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు టీ20 క్రికెట్ లో హాఫ్ సెంచరీ లేకుండానే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. 
మ్యాచ్‌ సాగిందిలా...
ముంబై ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్‌ ఆరంభించారు. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ దూకుడుకు ముంబై పవర్‌ప్లే ముగిసే సరికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో అక్షర్‌ పటేల్‌.. ముంబైకి షాక్‌ ఇచ్చాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసిన రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేశాడు. దీంతో 80 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో బంతికే అవుటై నిరాశ పరిచాడు. ఎన్నో అంచనాల మధ్య వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌... నోకియా బౌలింగ్‌లో ఫ్రేజర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి 42 పరుగులు చేసిన ఇషాన్ ఔటయ్యాడు. వెంటనే మరో వికెట్‌ నేలకూలింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్‌లో తిలక్‌ వర్మ... అక్షర్ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. పాండ్యా 39 పరుగులు చేసి అవుటయ్యాడు. టిమ్‌ డేవిడ్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45, షెపర్డ్‌ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. నోకియా వేసిన చివరి ఓవర్‌లో షెఫర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో నాలుగు సిక్సులు, రెండు ఫోర్లను బాది మొత్తంగా 32 పరుగులు పిండుకున్నాడు.
ఢిల్లీ పోరాడినా...
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పోరాడింది. పృథ్వీ షా, అభిషేక్‌ పోరెల్‌.. స్టబ్స్‌ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ డేవిడ్‌ వార్నర్‌... రిషభ్‌ పంత్‌ విఫలం కావడంతో ఢిల్లీకి లక్ష్య చేధన కష్టమైంది. అభిషేక్‌ పోరెల్‌ 31 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. ఢిల్లీని గెలిపించేందుకు స్టబ్స్‌ చివరిదాకా పోరాడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ...  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది.

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget