IPL 2023: ప్లేయర్స్‌లో ధోని, పాపులారిటీలో చెన్నై - ఐపీఎల్‌లో బాగా ఫేమస్!
ఐపీఎల్ జరిగినన్ని రోజులు మహేంద్ర సింగ్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాపులారిటీ విషయంలో టాప్‌లో నిలిచింది.
IPL 2023 Final: 59 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ముగియనుంది. రెండు నెలల కాలంలో ప్రతిరోజూ ఎన్నో కొత్త విషయాలు కనిపించాయి. కానీ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మార్పు లేదు. అదే చెన్నై సూపర్ కింగ్స్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న పాపులారిటీ. ఈ రెండు నెలల్లో ధోనీ పాపులారిటీ టాప్‌లో ఉంది. ఏ జట్టు కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కు సవాలు విసరలేదు.
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు, Ormax అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేయర్, అత్యంత ప్రజాదరణ పొందిన టీమ్ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో గత ఏడు వారాల మాదిరిగానే ఈసారి కూడా ధోనీ మొదటి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో మొదటి వారం నుంచి చివరి వారం వరకు మహేంద్ర సింగ్ ధోని ప్రతిసారీ అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా నిరూపించుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీనే కాదు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా తమ ముందు మరెవరూ నిలబడలేరని నిరూపించారు. ఐపీఎల్ 16 మొదటి వారం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రతిసారీ అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా అవతరించింది. గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లినప్పటికీ, వారు చెన్నై సూపర్ కింగ్స్‌ను సవాలు చేయలేకపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. రవీంద్ర జడేజా కెప్టెన్సీలో జట్టు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. దీంతో సీజన్ మధ్యలోనే చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని తిరిగి కెప్టెన్‌గా నియమించింది. కానీ అది ఫలించలేదు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
అయితే మహేంద్ర సింగ్ ధోని గత సీజన్ చివర్లోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామని తెలిపాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని తన హామీని నెరవేర్చాడు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు ఐదో టైటిల్ గెలుచుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నారు.
ఐపీఎల్ 2023 ఫైనల్లో ఢీకొంటున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs GT Final) మధ్య ఇంట్రెస్టింగ్ రైవల్రీ కొనసాగుతోంది! కొందరు ఆటగాళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఆధిపత్యం వహిస్తారో, ఎవరు తేలిపోతారో చూడాలి!
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేపై గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమికి అద్భుతమైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో కాన్వే మూడు ఇన్సింగ్సుల్లో 12 బంతులాడి ఐదు పరుగులే చేశాడు. మూడు సార్లు ఔటయ్యాడు. గైక్వాడ్ వికెట్ ఇవ్వనప్పటికీ 69.69 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. 66 బంతుల్లో 46 మాత్రమే కొట్టాడు. పైగా షమీకి అహ్మదాబాద్‌లో అమేజింగ్ రికార్డ్ ఉంది. 6.77 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు.
రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడుకి రషీద్ ఖాన్‌పై మంచి రికార్డు ఉంది. వారిద్దరూ అతడి బౌలింగ్‌ను ఉతికారేస్తారు. రషీద్‌పై గైక్వాడ్‌కు 147.36 స్ట్రైక్‌రేట్ ఉంది. ఆరు మ్యాచుల్లో 57 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రెండుసార్లే ఔటయ్యాడు. ఇక రాయుడికి 124.65 స్ట్రైక్‌రేట్ ఉంది. 73 డెలివరీల్లో రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు.