అన్వేషించండి

IPL 2024: ముంబైకి తొలి గెలుపు, పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్

MI vs DC IPL 2024: విమర్శలకు చెక్‌ పెడుతూ... అభిమానులకు ఆనందాన్ని పంచుతూ.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో.. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తొలి విజయం నమోదు చేసింది.

MI vs DC IPL 2024  Mumbai Indians won by 29 runs: విమర్శలకు చెక్‌ పెడుతూ... అభిమానులకు ఆనందాన్ని పంచుతూ.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో.. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(MI) తొలి విజయం నమోదు చేసింది. తొలుత ముంబై బ్యాటర్లు జూలు విదల్చగా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో ముంబై బ్యాటర్‌ రొమారియో  షెఫర్డ్‌ ఏకంగా 32 పరుగులు రాబట్టి హార్దిక్‌ సేనకు భారీ స్కోరు అందించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ(DC)... నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది. పృథ్వీ షా, స్టబ్స్‌ రాణించినా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

బ్యాటింగ్‌ సాగిందిలా...
ముంబై ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్‌ ఆరంభించారు. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ దూకుడుకు ముంబై పవర్‌ప్లే ముగిసే సరికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో అక్షర్‌ పటేల్‌.. ముంబైకి షాక్‌ ఇచ్చాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసిన రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేశాడు. దీంతో 80 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో బంతికే అవుటై నిరాశ పరిచాడు. ఎన్నో అంచనాల మధ్య వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌... నోకియా బౌలింగ్‌లో ఫ్రేజర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. దీంతో 81 పరుగుల వద్ద ముంబయి రెండో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి 42 పరుగులు చేసిన ఇషాన్ ఔటయ్యాడు. వెంటనే మరో వికెట్‌ నేలకూలింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్‌లో తిలక్‌ వర్మ అక్షర్ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 
పరుగుల రాక కష్టంగా ఉండటంతో హార్దిక్, టిమ్‌ డేవిడ్ ఆరంభంలో ఆచితూచి ఆడారు.

అనంతరం టిమ్‌ డేవిడ్‌ దూకుడు పెంచాడు. జే రిచర్డ్‌సన్ వేసిన ఈ ఓవర్‌లో సిక్స్‌ కొట్టాడు. ఈ క్రమంలో పాండ్యా 39 పరుగులు చేసి అవుటయ్యాడు. టిమ్‌ డేవిడ్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45, షెపర్డ్‌ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. నోకియా వేసిన చివరి ఓవర్‌లో షెఫర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో నాలుగు సిక్సులు, రెండు ఫోర్లను బాది మొత్తంగా 32 పరుగులు పిండుకున్నాడు.


ఢిల్లీ పోరాడినా...
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పోరాడింది. పృథ్వీ షా, అభిషేక్‌ పోరెల్‌.. స్టబ్స్‌ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ డేవిడ్‌ వార్నర్‌... రిషభ్‌ పంత్‌ విఫలం కావడంతో ఢిల్లీకి లక్ష్య చేధన కష్టమైంది. అభిషేక్‌ పోరెల్‌ 31 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. ఢిల్లీని గెలిపించేందుకు స్టబ్స్‌ చివరిదాకా పోరాడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ...  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది.

టాప్ హెడ్ లైన్స్

Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Embed widget