అన్వేషించండి

IPL2024: అగ్రస్థానంపై లక్నో కన్ను, ఢిల్లీ అడ్డుకోగలదా?

LSG vs DC : ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో తలపడనుంది.

LSG vs DC IPL2024 match Preview and prediction : ఈ ఐపీఎల్‌(IPL)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) మరో విజయంపై కన్నేసింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో లక్నో తలపడనుంది. ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన లక్నో..ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఐపీఎల్‌లో లక్నోపై ఇప్పటివరకూ గెలవని ఢిల్లీ... ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. కానీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్లను అడ్డుకోవాలంటే... ఢిల్లీ బౌలర్లు తమ స్థాయికి మించి రాణించాల్సి ఉంది. 

లక్నో బౌలింగే బలం
150కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు సంధిస్తూ లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న లక్నో స్టార్‌ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మయాంక్‌ పొత్తి కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ కేవలం ఒకే ఓవర్‌ బౌలింగ్‌ చేసి మైదానాన్ని వీడాడు. ఆ మ్యాచ్‌లో లక్నో పేసర్‌ యష్ ఠాకూర్... గుజరాత్‌పై అయిదు వికెట్లు తీసి సత్తా చాటాడు. యష్‌ ఠాకూర్‌ సహా నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో లక్నో బౌలింగ్‌ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డి కాక్, KL రాహుల్‌లతో బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. డికాక్‌ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోవడంతో కెప్టెన్‌ రాహుల్‌ ఇంకా సతమతమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఆ లోటు తీర్చుకోవాలని రాహుల్‌ పట్టుదలగా ఉన్నాడు. నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరిలో బ్యాటింగ్‌కు వస్తున్న పూరన్‌  విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. కానీ దేవదత్ పడిక్కల్ ఫామ్‌ లక్నోను ఆందోళన పరుస్తోంది.


ఢిల్లీ గాడిన పడేనా..?
ఢిల్లీ అయిదు మ్యాచుల్లో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ... తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టుదలగా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో తేలిపోతున్నారు. ముఖేష్ కుమార్ కూడా పెద్దగా రాణించడం లేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్ మినహా మిగిలిన బ్యాటర్లు ఇంకా గాడిన పడలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా మరోసారి బ్యాట్‌ ఝుళిపించాలని ఢిల్లీ కోరుకుంటోంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: 
రిషబ్ పంత్ ( కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్. 

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్.

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Embed widget