అన్వేషించండి

IPL 2024: కోల్‌కత్తా-ఢిల్లీ మ్యాచ్, రికార్డులు ఎవరివైపంటే?

KKR vs DC, IPL 2024: కోల్‌కత్తా-ఢిల్లీ ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్‌కత్తా 17 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది.

KKR vs DC IPL 2024 Head to Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL) 47వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(KKR) తలపడనుంది. ముంబై, లక్నోలపై పోరాడి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. కోల్‌కత్తా లోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఢిల్లీ ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవలేదు. కోల్‌కత్తా మాత్రం 2012, 2014లో టైటిల్‌ను ఒడిసిపట్టింది.

రికార్డులు ఇలా...
కోల్‌కత్తా-ఢిల్లీ ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్‌కత్తా 17 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది. ఢిల్లీ అరుణ్‌ జైట్లీ వేదికగా అత్యధికంగా పది మ్యాచులు జరగగా... అందులో అయిదు ఢిల్లీ.. అయిదు కోల్‌కత్తా గెలిచాయి. ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య 9 మ్యాచ్‌లు జరగగా, KKR 7 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, DC 2 గెలిచింది. ఈ  ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ఎనిమిది మ్యాచుల్లో అయిదు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో కొనసాగుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నాడు. రస్సెల్ విధ్వంసం జరుగుతుందేమో చూడాలి.

పిచ్‌ రిపోర్ట్‌
ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. పిచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు కూడా సహకారం అందించే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉంటే టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గు చూపుతుంది. ఢిల్లీ బ్యాటర్‌ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బలహీనమైన కోల్‌కత్తా బౌలింగ్‌లో ఫ్రేజర్ మరింత విధ్వంసకరంగా ఆడతానడంతో సందేహం లేదు. మామూలు బౌలర్లు దొరికితే ఫ్రేజర్‌ ఎంత విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. మెక్‌గర్క్‌తో పాటు స్టబ్స్ కూడా తన అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాడు.  

అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, పంత్, స్టబ్స్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ చాలా బలంగా కనిపిస్తోంది. పంత్ ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్నాడు. కోల్‌కత్తా  బ్యాటర్‌ నరైన్ సంచలనాత్మక  ఫామ్‌లో ఉన్నాడు. నరైన్‌ ఎనిమిది మ్యాచ్‌లలో రెండు అర్ధసెంచరీలు, ఒక సెంచరీతో 357 పరుగులు చేశాడు. నరైన్-ఫిల్ సాల్ట్ జోడీ కోల్‌కత్తాకు మంచి ఆరంభాలు అందిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget