IPL 2024: టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ, కోల్‌కత్తాకే బెనిఫిట్!
KKR vs DC, IPL 2024: ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో ఢిల్లీ తలపడనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
KKR vs DC IPL 2024 Delhi Capitals opt to bat: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా(KKR)తో ఢిల్లీ(DC) తలపడనుంది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తాతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ తలపడనుంది. మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌కు చేరుకోవాలని పంత్ సేన పట్టుదలగా ఉంది. గుజరాత్, ముంబైలపై వరుస విజయాలు సాధించిన ఢిల్లీ.. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లోనే ఢిల్లీపై 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కత్తా దాన్ని పునరావృతం చేసి... ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని చూస్తోంది.
పిచ్ బ్యాటింగ్ కే అనుకూలం అందుకే ..
ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్యాటర్లు భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. సమయం గడుస్తున్న కొద్ది బౌలర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉంటే టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతుంది అన్న అభిప్రాయం నిజమయ్యేలా టాస్ గెలిచిన పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బలహీనమైన కోల్‌కత్తా బౌలింగ్‌లో ఫ్రేజర్ మరింత విధ్వంసకరంగా ఆడతానడంతో సందేహం లేదు. మెక్‌గర్క్‌తో పాటు స్టబ్స్ కూడా తన అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాడు. ఇక పంత్ విషయం అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.
కోల్‌కతా తుది జట్టు..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రి రస్సెల్, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ఢిల్లీ తుది జట్టు ..
రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరెల్, షై హోప్,, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రసిక్ సలామ్, లిజాడ్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్.