IPL Points Table 2022: పాయింట్ల పట్టికలో టాప్ లేపిన కేకేఆర్ - పర్పుల్, ఆరెంజ్ క్యాప్‌లు సైతం వీళ్లకే
IPL Points Table 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌తో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో దుమ్మురేపుతున్నారు. రస్సెల్, ఉమేశ్ యాదవ్ ఆరెంజ్, పర్సుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెండు పర్యాయాలు టైటిల్ అందుకున్న జట్టు కోల్‌కతా రైట్ రైడర్స్. గతంలో గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2 సార్లు కేకేఆర్ ట్రోఫీని ముద్దాడింది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టిక (IPL Points Table 2022)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కేకేఆర్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
పర్పుల్, ఆరెంజ్ క్యాప్‌లు కేకేఆర్ సొంతం..
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌తో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో దుమ్మురేపుతున్నారు. ఐపీఎల్ 2022లో కేకేఆర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ లీడ్ స్కోరర్‌గా నిలవగా.. టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ 3 మ్యాచ్‌లలో కలిపి 95 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 2 మ్యాచ్‌లలో 93 రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. బౌలర్లలో 3 మ్యాచ్‌లలో 8 వికెట్లతో కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ టాప్ లో ఉన్నాడు. టీమ్ సౌథీ, వానింద్ హసరంగలు 2 మ్యాచ్‌లలో చెరో 5 వికెట్లు తీశారు.
యువ కెప్టెన్ల జట్లు అగ్రస్థానంలో..
క్ర. సం | టీమ్ | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | నెట్ రన్‌రేట్ | పాయింట్లు |
1 | KKR | 3 | 2 | 1 | 0.843 | 4 |
2 | RR | 1 | 1 | 0 | 3.050 | 2 |
3 | DC | 1 | 1 | 0 | 0.914 | 2 |
4 | GT | 1 | 1 | 0 | 0.286 | 2 |
5 | LSG | 2 | 1 | 1 | -0.011 | 2 |
6 | RCB | 2 | 1 | 1 | -0.048 | 2 |
7 | PBKS | 2 | 1 | 1 | -1.183 | 2 |
8 | CSK | 2 | 0 | 2 | -0.528 | 0 |
9 | MI | 1 | 0 | 1 | -0.914 | 0 |
10 | SRH | 1 | 0 | 1 | -3.050 | 0 |
ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆండ్రీ రస్సెల్
క్ర. సం | ఆటగాడు | మ్యాచ్‌లు | రన్స్ |
1 | ఆండ్రీ రస్సెల్ | 3 | 95 |
2 | ఫాఫ్ డుప్లెసిస్ | 2 | 93 |
3 | ఇషాన్ కిషన్ | 1 | 81 |
పర్పుల్ క్యాప్‌ని కైవసం చేసుకున్న ఉమేశ్ యాదవ్
క్ర. సం | బౌలర్ | మ్యాచ్‌లు | వికెట్లు |
1 | ఉమేశ్ యాదవ్ | 3 | 8 |
2 | టిమ్ సౌథీ | 2 | 5 |
3 | వానింద్ హసరంగ | 2 | 5 |