అన్వేషించండి

IPL 2024: రికార్డుల్లో ముంబైదే పైచేయి, మరోసారి ఆధిపత్యమేనా ?

Mumbai Indians Vs Rajasthan Royals: వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబై...వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్‌.. ఈ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

MI vs RR Match Head To Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మ్యాచ్‌ నెంబర్‌ 14లో ముంబై(MI)-రాజస్థాన్‌ రాయల్స్‌(RR) తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబై...వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్‌.. ఈ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో తొలి విజయాన్ని సాధించేందుకు ముంబై ఇండియన్స్ ఉవ్విళ్లూరుతోంది. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని నిరాశాజనకంగా ప్రారంభించాడు. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయాల తర్వాత గెలుపు బాట పట్టాలని హార్దిక్‌ సేన చూస్తోంది.

ముంబై-రాజస్థాన్‌ హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్  మొత్తం 28 సార్లు తలపడ్డాయి. ఈ 28 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్  15 సార్లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్  13 విజయాలు సాధించింది. 

ఆల్ టైమ్ టాప్ పెర్ఫార్మర్స్
ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో జోస్ బట్లర్  అత్యధికంగా 467 పరుగులు చేశాడు. తర్వాతి స్థానాల్లో సంజూ శాంసన్ 462 పరుగులతో ఉన్నాడు. 
మూడో స్థానంలో 414 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. బౌలర్ల జాబితాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా 17 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జోఫ్రా ఆర్చర్ 13 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

గత మ్యాచ్‌లో ఇలా..
ముంబై-రాజస్థాన్‌ చివరిసారిగా 30 ఏప్రిల్ 2023న ముంబైలో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ (124) సెంచరీతో 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై... సూర్యకుమార్ యాదవ్ 55 పరుగులు, టిమ్ డేవిడ్ 45 పరుగులతో చెలరేగడంత  6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

జట్లు
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget