అన్వేషించండి

IPL 2024: లక్నోపై ఓటమే లేని గుజరాత్‌, చరిత్ర మార్చేందుకు సిద్ధమా?

LSG vs GT IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్‌తో గుజరాత్‌ నాలుగుసార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

IPL 2024 LSG vs GT  Head to Head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 సీజన్‌ 21వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో  తమ విజయాల జోరును కొనసాగించాలని రాహుల్‌ సేన చూస్తోంది. లక్నో పేస్‌ సెన్సేషన్ మాయంక్‌ యాదవ్‌పై అందరి దృష్టి  కేంద్రీకృతమైన వేళ... లక్నో పేస్‌కు.. గుజరాత్‌  బ్యాటర్లకు రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బుల్లెట్లల దూసుకొచ్చే బంతులతో కచ్చితత్వంతో అభిమానులను, విమర్శకులను మయాంక్‌ యాదవ్‌ మెస్మరైజ్ చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ మయాంక్‌ రాణిస్తాడని లక్నో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్‌తో గుజరాత్‌ నాలుగుసార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గుజరాత్ టైటాన్స్ గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. 2022 ఛాంపియన్‌ అయిన గుజరాత్‌... లక్నోతో మొత్తం నాలుగు సార్లు తలపడింది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ గురజాత్‌ గెలిచింది. ఎకానా స్టేడియంలో 30-32° ఉష్ణోగ్రత ఉంటుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ  రెండు జట్లు ఒకేసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 135 పరుగులు చేసి... లక్నోను 128/7 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. 

చూపంతా మాయంక్‌పైనే 
కొత్త పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని సత్తా చాటడం లక్నోకు వరంలా మారింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల మాయంక్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను తన పేస్‌తో ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3/14 గణాంకాలతో ఆర్సీబీ ఓటమికి ప్రధామ కారణమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను 151 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఆశ్చర్యపరిచాడు. మయాంక్‌ యాదవ్‌ అద్భుతమైన ప్రదర్శనలు... ఈ మ్యాచ్‌లో చూపంతా అతడిపైనే ఉండేలా చేశాయి. లక్నో ఓపెనింగ్‌ జోడీ క్వింటన్ డి కాక్-  KL రాహుల్‌లు మరోసారి భారీ భాగస్వామ్యం నెలకొల్పాలని చూస్తున్నారు. 


లక్నో జట్టు(అంచనా): క్వింటన్ డి కాక్, KL రాహుల్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్

గురాజత్‌ జట్టు (అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్( కెప్టెన్‌), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget