అన్వేషించండి

IPL 2024: ముంబైకి దిమ్మతిరిగే షాక్ - ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

IPL 2024 GT vs MI: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న ముంబై ఆశలపై  గుజరాత్‌ టైటాన్స్‌ నీళ్లు చల్లింది.

 GT Won by 6 runs : ఐపీఎల్‌(IPL)లో ముంబై ఇండియన్స్‌(MI)కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న ముంబై ఆశలపై  గుజరాత్‌ టైటాన్స్‌(GT) నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గుజారాయ్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకోగా... బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్యానికి 6 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. రోహిత్‌ శర్మ, బ్రెవీస్‌ రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో గుజరాత్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో...ముంబై బాటర్లను కట్టడి చేశారు...
 
రాణించిన ముంబై బౌలర్లు...
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. హార్దిక్ పాండ్య వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్‌ గిల్, వృద్ధీమాన్ సాహా మంచి ఆరంభమే ఇచ్చారు. 3 ఓవర్లకు 27 పరుగులు చేశారు. ఈ సమయంలో గుజరాత్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా షాక్‌ ఇచ్చాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి సాహా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 19 పరుగులు చేసి సాహా అవుటయ్యాడు. శుభ్‌మన్‌ గిల్‌ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 47/1. ఈ సమయంలో గుజరాత్ కీలకమైన వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో లాంగాన్‌లో రోహిత్‌ శర్మకు చిక్కాడు. 66 పరుగుల వద్ద గిల్‌ అవుటయ్యాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న గెరాల్డ్ కొయెట్జీ మొదటి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌లో చివరి బంతికి 17 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను కొయెట్జీ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ (12), సాయి సుదర్శన్‌ (45) పరుగులు చేసి అవుటయ్యారు.  బుమ్రా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ అవుటయ్యాడు. తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోవడంతో గుజరాత్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
 
లక్ష్య ఛేదన ఇలా...
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు తొలి ఓవర్‌లోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయ్యాడు. ఒమ్రాజాయ్‌ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ వెనుదిరిగాడు. రోహిత్‌ శర్మకు జత కలిసిన నమన్‌ ధీర్ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. 30 పరుగుల వద్ద నమన్‌ వెనుదిరిగినా రోహిత్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో తాను ఎంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. బ్రెవిస్‌తో జత కలిసి ముంబైను లక్ష్యం దిశగా నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు విలువైన 77 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సుతో 43 పరుగులు చేసిన రోహిత్‌ను సాయి కిశోర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 38 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సులతో 46 పరుగులు చేసిన బ్రెవిస్‌ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై తొలి మ్యాచులో పరాజయం పాలైంది

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget