Arjun Tendulkar Debut: అర్జున్ తెందూల్కర్ ఎంట్రీ! టాస్ గెలిచిన ముంబయి
Arjun Tendulkar Debut: ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వాంఖడే వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలవగానే ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.
Arjun Tendulkar Debut, IPL 2023:
ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వాంఖడే వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచులో రోహిత్ శర్మ ఆడటం లేదు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. టాస్ గెలవగానే అతడు బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం, సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కలను నెరవేర్చుకుంటున్నాడు.
🚨 𝙏𝙝𝙚 𝙡𝙞𝙣𝙚-𝙪𝙥𝙨 𝙖𝙧𝙚 𝙄𝙉 🚨
— IndianPremierLeague (@IPL) April 16, 2023
Arjun Tendulkar set to make his IPL debut.
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR pic.twitter.com/mTj7x6q9I4
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. వికెట్ డ్రైగా కనిపిస్తోంది. ఆ తర్వాత బ్యాటు మీదకు బంతి చక్కగా వస్తుంది. రోహిత్ ఆడటం లేదు. కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మేం మెరుగ్గా ఆడాల్సిన సమయమిది. డువాన్ జెన్‌సెన్ వస్తున్నాడు' అని ముంబయి ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
'మేం మొదట బ్యాటింగే చేయాలనుకున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మా మూడ్ బాగుంది. బౌలింగులో మెరుగుపడాలి. మేం 200-210 ఛేజ్ చేయగలం. రెండో ఇన్నింగ్సులో బంతి టర్న్ అవుతుందనే అనుకుంటున్నా. ఒక్కడే అన్ని మ్యాచుల్నీ గెలిపించడలేదు. ఎందుకంటే ఇది టీమ్ స్పోర్ట్. అందరూ పరుగులు చేస్తుండటం శుభ సూచికం. ఈ వికెట్‌పై 180 టార్గెట్ ఇచ్చేందుకు ట్రై చేస్తాం. సేమ్ టీమ్‌తో ఆడుతున్నాం' అని కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా అన్నాడు.
🚨 Toss Update@surya_14kumar, who is captaining @mipaltan today, wins the toss & #MI elect to bowl against @KKRiders. #TATAIPL | #MIvKKR
— IndianPremierLeague (@IPL) April 16, 2023
Details ▶️ https://t.co/CcXVDhfzmi
A special TOSS representative in form @ImHarmanpreet - Captain of #TeamIndia & #MI in @wplt20. 👏 👏 pic.twitter.com/jMl2QxObJN
ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యుకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహల్ వాదెరా, అర్జున్ తెందూల్కర్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, డువాన్ జన్‌సెన్, రిలే మెరిడీత్
కోల్‌కతా నైట్ రైడర్స్: రెహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, జగదీశన్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి
ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్‌కి ఇష్టమైన శత్రువు కోల్‌కతా నైట్‌రైడర్స్. ఎందుకంటే రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడతాయి. హిస్టరికల్‌గా చూస్తే కేకేఆర్‌పై ముంబయిదే అప్పర్ హ్యాండ్! ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా 22-9తో రోహిత్ సేనదే తిరుగులేని ఆధిపత్యం. విజయాల శాతం ఏకంగా 70.96 శాతం. పది మ్యాచులు ఆడిన మరే జట్టుపైనా ఇలాంటి ఆధిపత్యం ముంబయికి లేదు. రీసెంట్ ఫామ్ ప్రకారమైతే కేకేఆర్ బాగుంది. చివరి ఐదు మ్యాచుల్లో ఆఖరి మూడింట్లో విజయ ఢంకా మోగించింది.
Pre-match catch-ups 🤝✅
— IndianPremierLeague (@IPL) April 16, 2023
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR pic.twitter.com/e90pZyfhfI