By: ABP Desam | Updated at : 07 May 2022 07:30 PM (IST)
Edited By: Ramakrishna Paladi
యశస్వీ జైశ్వాల్ (iplt20.com)
PBKS vs RR, Match Highlights: ఐపీఎల్ 2022లో 52వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ మరో విజయం అందుకుంది. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకెళ్లింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్‌ను సమయోచితంగా ఛేదించింది. 6 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (68; 41 బంతుల్లో 9x4, 2x6) అమేజింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్ (30; 16 బంతుల్లో 5x4, 1x6) మెరిశాడు. హెట్‌మెయిర్ (31*; 16 బంతుల్లో 3x4, 2x6) దంచికొట్టాడు. అంతకు ముందు పంజాబ్ కింగ్స్‌లో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (56; 40 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భానుక రాజపక్స (27; 18 బంతుల్లో 2x4, 2x6), జితేశ్ శర్మ (38*; 18 బంతుల్లో 4x4, 2x6) మెరుపు షాట్లు ఆడారు.
జైశ్వాల్ జజ్జనక!
భారీ టార్గెట్ కావడంతో రాజస్థాన్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్ నువ్వా నేనా అన్నట్టుగా ఆడారు. పోటీ పడి మరీ షాట్లు కొట్టారు. దాంతో 4 ఓవర్లకే 46 పరుగులు వచ్చాయి. అయితే 3.6వ బంతికి బట్లర్‌ను రబాడా ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజు శాంసన్ (23; 12 బంతుల్లో 4x4) సింపుల్‌గా పరుగుల వరద పారించాడు. చక్కని బౌండరీలు కొట్టిన అతడిని రిషి ధావన్ జట్టు స్కోరు 85 వద్ద పెవిలియన్ పంపించాడు. అక్కడ్నుంచి దేవదత్ పడిక్కల్ (31; 32 బంతుల్లో 3x4) అండతో జైశ్వాల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో 15.3 ఓవర్లకు రాజస్థాన్ 150కి చేరుకుంది. అంతకు ముందే జైశ్వాల్‌ను అర్షదీప్ ఔట్ చేసి టెన్షన్ పెట్టాడు. కానీ హెట్‌మెయిర్ బౌండరీలు, సిక్సర్లు బాదేస్తూ విజయం అందించాడు.
జానీ, జిత్తు సూపర్ బ్యాటింగ్
మధ్యాహ్నం మ్యాచు కావడం, తొలుత బ్యాటింగ్ చేస్తున్న జట్లు గెలుస్తుండటంతో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం దొరికింది. శిఖర్ ధావన్ (12; 17 బంతుల్లో) త్వరగా పెవిలియన్ చేరుకున్నా జానీ బెయిర్ స్టో మాత్రం దంచికొట్టాడు. మొదట్లో కొన్ని ఇన్‌సైడ్ ఎడ్జ్ అయినప్పటికీ అలవాటు పడ్డాక చక్కని షాట్లు ఆడాడు. మరోవైపు భానుక రాజపక్స సైతం భారీ సిక్సర్లు, బౌండరీలు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. జట్టు స్కోరు 89 వద్ద రాజపక్సను చాహల్ బౌల్డ్ చేశాడు. బెయిర్ స్టో 34 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. అయితే పరుగు వ్యవధిలోనే మయాంక్ అగర్వాల్ (15), జానీని చాహలే పెవిలియన్ పంపించాడు. ఆఖర్లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టన్ (22; 14 బంతుల్లో 1x3, 2x6) మెరుపు షాట్లు ఆడటంతో స్కోరు 189/5కు చేరుకుంది. యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది.
The 𝘩𝘰𝘸 𝘪𝘵 𝘴𝘵𝘢𝘳𝘵𝘦𝘥 vs 𝘩𝘰𝘸 𝘪𝘵’𝘴 𝘨𝘰𝘪𝘯𝘨 we love to see. 💗 pic.twitter.com/hb3c3zv7hP
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2022
What he said. 💗🔥 pic.twitter.com/yjvMl7fcKj
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2022
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
LSG vs RCB, Eliminator Highlights: సెంచరీతో రప్ఫాడించిన రజత్ - ఎలిమినేటర్‌లో LSG టార్గెట్ 208
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు