అన్వేషించండి

PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్‌లో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (63: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. అనంతరం పంజాబ్ ఓవర్లలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది.

ఆదుకున్న మిషెల్ మార్ష్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0: 1 బంతి) మొదటి బంతికే లియాం లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ ఆ ఒత్తిడి జట్టుపై పడకుండా మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (32: 16 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), మిషెల్ మార్ష్ వేగంగా ఆడారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 29 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. ఈ జోడి భాగస్వామ్యం బలపడుతున్న దశలో అర్ష్‌దీప్ సింగ్.. సర్ఫరాజ్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపించాడు.

ఆ తర్వాత వచ్చిన లలిత్ యాదవ్ (24: 21 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)... మిషెల్ మార్ష్‌కు చక్కటి సహకారం అందించాడు. మూడో వికెట్‌కు వీరు 47 పరుగులు జోడించారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ను కూడా అర్ష్‌దీప్ సింగే బ్రేక్ చేశాడు. లలిత్ యాదవ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. లలిత్ అవుటయ్యాక ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. రిషబ్ పంత్ (7: 3 బంతుల్లో, ఒక సిక్సర్), రొవ్‌మన్ పావెల్ (2: 6 బంతుల్లో) విఫలం అయ్యారు. దీనికి తోడు అక్షర్ పటేల్ బంతులు వృథా చేశాడు.

దీంతో మిషెల్ మార్ష్ మీద ఒత్తిడి పడింది. తను భారీ షాట్లకు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది. 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్ష్ కూడా అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితం అయింది. పంజాబ్ బౌలర్లలో లియాం లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. కగిసో రబడ ఒక వికెట్ తీశాడు. 

ఆరంభం అదరగొట్టినా...
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ వేగంగానే ప్రారంభం అయింది. మొదటి వికెట్‌కు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (28: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) 3.5 ఓవర్లలోనే 38 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న బెయిర్‌స్టోను అవుట్ చేసి నోర్జే ఢిల్లీకి మొదటి వికెట్ అందించాడు.

అయితే ఆ తర్వాత భనుక రాజపక్స (4: 5 బంతుల్లో, ఒక ఫోర్), లియాం లివింగ్ స్టోన్ (3: 5 బంతుల్లో), మయాంక్ అగర్వాల్ (0: 2 బంతుల్లో), హర్‌ప్రీత్ బ్రార్ (1: 2 బంతుల్లో), రిషి ధావన్ (4: 13 బంతుల్లో) దారుణంగా విఫలం కావడంతో పంజాబ్ 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాహుల్ చాహర్ (25 నాటౌట్: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), జితేష్ శర్మ (44: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. భారీ షాట్లు ఆడుతూ పంజాబ్ శిబిరంలో ఆశలు చిగురింపజేశారు.

అయితే కీలక సమయంలో జితేష్ అవుట్ కావడం... రాహుల్ చాహర్‌కు సరైన సహకారం అందించేవారు కరువవడంతో పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితం అయింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా... అక్షర్, కుల్దీప్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆన్రిచ్ నోర్జే ఒక వికెట్ పడగొట్టాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Ambulance Theft: రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో  మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Embed widget