IPL 2024: టాస్ గెలిచిన లక్నో, ఢిల్లీదే తొలి బ్యాటింగ్
DC vs LSG, IPL 2024: ఐపీఎల్ 17 సీజన్‌లో ఇవాళ ఈరోజు ఢిల్లీ, లక్నో ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ రేసు ఉత్కంఠభరితంగా మారిన వేళ రెండు టీం లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
DC vs LSG Lucknow Super Giants opt to bowl: రోజురోజుకీ మరింత ఉత్కంఠభరితంగా మారుతున్న ఐపిఎల్ లో ఈరోజు ఢిల్లీ, లక్నో ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. ప్లే ఆఫ్ రేసు ఉత్కంఠభరితంగా మారిన వేళ ఇక మిగిలిన ప్రతీ మ్యాచ్ చాలా కీలకం కానుంది.
ఈ సీజన్‌లో ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్‌లో టాప్ 4 కంటే కింద ఉండి..ప్లే ఆఫ్స్‌లో ఉండటానికి మెరుగైన ఛాన్సెస్ ఉన్న జట్టు ఏదంటే ఉన్న ఒకే ఒక్క టీమ్ లక్నో సూపర్ జెయింట్స్. ఆ టీమ్ ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లు మాత్రమే ఆడి 6విజయాలతో 12పాయింట్లతో ప్రస్తుతానికి 7వస్థానంలో ఉన్నట్లు కనపడుతున్నా తనకు మిగిలిన రెండు మ్యాచులు గెలిచేస్తే క్వాలిఫైయర్ రేస్‌లో ముందుండటం పక్కా. ఇలాంటి టైమ్‌లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ఆడుతోంది LSG. ఈ మ్యాచ్ గెలిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి ఢిల్లీ ఓడిపోతే మాత్రం ఐపీఎల్ నుంచి ఎలిమినేషనే.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగినా ప్రతీ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు కూడా కావడంతో బ్యాటర్లు తేలిగ్గా బౌండరీలు బాదేస్తారు. షార్ట్ స్ట్రెయిట్ బౌండరీలు, షార్ట్ స్క్వేర్ బౌండరీలు ఉండడంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయినా సరే కెప్టెన్ రాహుల్ ధైర్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్లేఆఫ్ చేరడానికి ఢిల్లీ కంటే లక్నోకు ఎక్కువ అవకాశం ఉంది. కానీ గత రెండు మ్యాచుల్లో భారీ ఓటములు లక్నో ప్లే ఆఫ్ అవకాశాలను చాలా సంక్లిష్టంగా మార్చాయి. లక్నో 16 పాయింట్లు రావాలంటే... మిగిలి ఉన్న ఢిల్లీ, ముంబై మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచులో ఓడిపోయినా లక్నో కథ ముగిసినట్లే. గత మ్యాచ్‌లో తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి సాధికార విజయం సాధించింది.
లక్నో తుది జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, యుధ్విర్ సింగ్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, మోసిన్ ఖాన్.
ఢిల్లీ లెవన్
అభిషేక్ పొరెల్, జేక్ ఫ్రేజర్, షై హోప్, రిషభ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నైబ్, రసిక్ సలామ్, ముకేశ్ కుమార్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.